మాస్‌ మల్లి | Allari Naresh Bacchala Malli first look poster released | Sakshi
Sakshi News home page

మాస్‌ మల్లి

May 29 2024 12:02 AM | Updated on May 29 2024 12:02 AM

Allari Naresh Bacchala Malli first look poster released

సిగరెట్‌ కాల్చుతూ రిక్షాలో మాస్‌గా కూర్చొన్న అతని పేరు మల్లి. ఇంటిపేరు బచ్చల. చేసేది ట్రాక్టర్‌ డ్రైవర్‌గా... ఇంకా అతని పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకునేవారు థియేటర్స్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ‘అల్లరి’ నరేశ్‌ టైటిల్‌ రోల్‌ చేస్తున్న తాజా చిత్రం ‘బచ్చల మల్లి’. 1990 నేపథ్యంలో సాగే ఈ సినిమాకు ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ ఫేమ్‌ సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహిస్తున్నారు. హాస్య మూవీస్‌ బ్యానర్‌పై రాజేశ్‌ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మంగళవారం ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ఈ పోస్టర్‌లో సీరియస్‌ లుక్‌లో కనిపిస్తున్నారు ‘అల్లరి’ నరేశ్‌. ‘‘ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ బచ్చల మల్లి చాలా రోజులు గుర్తిండిపోతాడు. నిర్మాణం పనులు తుది దశకు చేరుకున్నాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. అమృతా అయ్యర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో రోహిణి, రావు రమేశ్, అచ్యుత్‌ కుమార్, బలగం జయరామ్, హరితేజ, ప్రవీణ్, వైవా హర్ష ముఖ్య పాత్రధారులు. ఈ సినిమాకు సంగీతం: విశాల్‌ చంద్రశేఖర్, కెమెరా: రిచర్డ్‌ ఎం. నాథన్‌.

Advertisement
 
Advertisement
Advertisement