Allahabad High Court Slams Censor Board Over Adipurush Dialogues - Sakshi
Sakshi News home page

Adipurush: ఆదిపురుష్‌.. సెన్సార్‌ బోర్డుపై అలహాబాద్‌ హైకోర్టు ఫైర్‌

Jun 27 2023 4:59 PM | Updated on Jun 27 2023 5:19 PM

Allahabad High Court Slams Censor Board Over Adipurush Dialogues - Sakshi

భారీ అంచాల మధ్య విడుదలైన ‘ఆదిపురుష్‌’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. రామాయణం ఇతీహాసం ఆధారంగా ఓ రౌత్‌ తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రభాస్‌ రాముడిగా, కృతీసనన్‌ జానకిగా నటించారు. సాంకేతికపరంగా ఈ చిత్రం మెప్పించినా.. కంటెంట్‌ పరంగా అలరించలేకపోవడంతో పాటు కొన్ని సన్నివేశాలు రామాయణానికి విరుద్ధంగా తీర్చిదిద్దారనే విమర్శలు వచ్చాయి. మరోవైపు పలు వివాదాలు కూడా ఈ చిత్రాన్ని చుట్టుముట్టాయి.

ఈ చిత్రాన్ని వెంటనే నిలిపివేయాలంటూ పలు కోర్టులో పిటిషన్స్‌ దాఖలయ్యాయి. ఈ సినిమాలోని కొన్ని డైలాగ్స్‌ని తొలగించాలాంటూ అలహాబాద్‌ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై నేడు విచారణ జరిగింది. ఈ సందర్భంగా సెన్సార్‌ బోర్డుని ధర్మాసనం తప్పుబట్టింది. సెన్సార్‌కు పంపిన సమయంలో ఇలాంటి డైలాగ్స్‌ని ఎందుకు సమర్థించారని కోర్టు ప్రశ్నించింది.

(చదవండి:  ఓటీటీకి 'ది కేరళ స్టోరీ'.. ఆలస్యం అందుకేనన్న ఆదాశర్మ!)

ఇలాంటి వాటి వల్ల భవిష్యతు తరాలకు ఎలాంటి సందేశాలను అందించాలనుకుంటున్నారని మండిపడింది. సినిమా దర్శకనిర్మాత విచారణకు హాజరుకాకపోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.  కాగా, ఆదిపురుష్‌ చిత్రంలో కొన్ని సంభాషణలు అభ్యంతరకరంగా ఉన్నాయని ప్రేక్షకుల నుంచి విమర్శలు రావడంతో..చిత్రబృందం వాటిని తొలగించింది. అయినప్పటికీ వివాదం మాత్రం ఆగడం లేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement