కన్నప్పలో అక్షయ్‌ కుమార్‌  | Akshay Kumar joins Vishnu Manchu Kannappa shoot in Hyderabad | Sakshi
Sakshi News home page

కన్నప్పలో అక్షయ్‌ కుమార్‌ 

Apr 17 2024 1:17 AM | Updated on Apr 17 2024 10:30 AM

Akshay Kumar joins Vishnu Manchu Kannappa shoot in Hyderabad - Sakshi

మోహన్‌బాబు, అక్షయ్‌ కుమార్, విష్ణు మంచు 

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ ‘కన్నప్ప’ చిత్రం షూటింగ్‌లో జాయిన్‌ అయ్యారు. విష్ణు మంచు టైటిల్‌ రోల్‌లో రూపొందుతోన్న చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై మంచు మోహన్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్‌బాబు, మోహన్‌ లాల్, శరత్‌ కుమార్, బ్రహ్మానందం వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ షూటింగ్‌లో జాయిన్‌ అయ్యారు అక్షయ్‌ కుమార్‌.

ఈ సందర్భంగా మోహన్‌బాబు, విష్ణు మంచు కలిసి అక్షయ్‌కి స్వాగతం పలికారు. ‘‘శివ భక్తుడైన కన్నప్ప కథను ‘కన్నప్ప’గా తెరపైకి తీసుకొస్తున్నాం. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో ఈ మూవీ రూపొందుతోంది. హైదరాబాద్‌లో మూడో షెడ్యూల్‌ చిత్రీకరణ జరుగుతోంది. అక్షయ్‌తో పాటు ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం’’ అన్నారు మేకర్స్‌.

Advertisement
 
Advertisement
Advertisement