మ్యాడ్‌ లాంటి సినిమాలు ఆరోగ్యానికి మంచిది- నాగచైతన్య | Akkineni Naga Chaitanya Speech At MAD Square Pre-release event | Sakshi
Sakshi News home page

మ్యాడ్‌ లాంటి సినిమాలు ఆరోగ్యానికి మంచిది- నాగచైతన్య

Mar 28 2025 1:49 AM | Updated on Mar 28 2025 5:45 AM

Akkineni Naga Chaitanya Speech At MAD Square Pre-release event

– అక్కినేని నాగచైతన్య

‘మ్యాడ్‌ స్క్వేర్‌’ మూవీ ట్రైలర్‌ బాగుంది. నేను ‘మ్యాడ్‌’ సినిమాలోని కామెడీ సీన్స్‌ చూస్తూ ఒత్తిడిని దూరం చేసుకుంటుంటాను. ఇలాంటి సినిమాలు ఆరోగ్యానికి చాలా మంచిది. డల్‌గా ఉన్నప్పుడు ‘మ్యాడ్‌’ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా సూచించాలనేది నా అభిప్రాయం’’ అని హీరో అక్కినేని నాగచైతన్య చెప్పారు. నార్నే నితిన్, సంగీత్‌ శోభన్, రామ్‌ నితిన్‌ హీరోలుగా నటించిన చిత్రం ‘మ్యాడ్‌ స్క్వేర్‌’. 

కల్యాణ్‌ శంకర్‌ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం నేడు రిలీజ్‌ అవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన అక్కినేని నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘మ్యాడ్‌ స్క్వేర్‌’ లాంటి సినిమాలు ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి సరదాగా గడిపేలా చేస్తాయి. ఫ్రెండ్‌షిప్‌ని స్ట్రాంగ్‌ చేస్తాయి. కొత్త ఫ్రెండ్స్‌ని పరిచయం చేస్తాయి. 

కామెడీ చేయడం అనేది చాలా కష్టం. నార్నే నితిన్, రామ్, సంగీత్‌లలో ఆ టాలెంట్‌ ఉంది కాబట్టే ఇంత నవ్వించగలిగారు. నాగవంశీ, నా ప్రయాణం ‘ప్రేమమ్‌’ సినిమాతో మొదలైంది. దర్శకులకు, నటులకు ఎంతో ధైర్యాన్నిస్తూ వరుస విజయాలు అందుకుంటున్నారు వంశీ. ఈ మూవీ బ్లాక్‌ బస్టర్‌ అవుతుంది. ‘మ్యాడ్‌  2’ మాత్రమే కాదు.. ‘మ్యాడ్‌ 100’ కూడా రావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement