అజిత్‌, ప్రశాంత్‌ నీల్‌ సినిమాపై మేనేజర్‌ క్లారిటీ | Ajith Manager Clarity With Prashanth Neel Movie | Sakshi
Sakshi News home page

అజిత్‌, ప్రశాంత్‌ నీల్‌ సినిమాపై మేనేజర్‌ క్లారిటీ

Jul 26 2024 5:08 PM | Updated on Jul 26 2024 5:58 PM

Ajith Manager Clarity With Prashanth Neel Movie

కోలీవుడ్‌ స్టార్‌ హీరో అజిత్‌తో దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ఒక సినిమా ప్లాన్‌ చేసినట్లు కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అజిత్‌ మేనేజర్‌ క్లారిటీ ఇచ్చారు. 'కె.జి.ఎఫ్‌' కథకు కనెక్ట్‌ అయ్యేలా మరో స్టోరీని ప్రశాంత్‌ రెడీ చేశాడాని, అందులో అజిత్‌ హీరోగా నటించనున్నారని కోలీవుడ్‌లో వార్తలు వచ్చాయి. అయితే, ఈ విషయం గురించి తాజాగా అజిత్‌ మేనేజర్‌ మాట్లాడుతూ.. అదంతా ప్రచారం మాత్రమేనని చెప్పుకొచ్చారు.

అజిత్‌ మేనేజర్‌ సురేష్ చంద్ర ఈ వాదనలను ఇలా ఖండించారు..  'ఈ పుకార్లు ఆన్‌లైన్‌లో వచ్చాయి. ఇందులో ఎలాంటి నిజం లేదు. అజిత్, ప్రశాంత్ నీల్ కలిశారనేది మాత్రం నిజమే.. కానీ, వారు ఒకరినొకరు మర్యాదపూర్వకంగా మాత్రమే కలుసుకున్నారు. ఒకరినొకరు అత్యున్నత గౌరవం కలిగి ఉంటారు. అయితే, వారు కలిసినప్పుడు ఏ సినిమా గురించి చర్చించలేదు. ప్రశాంత్‌ డైరెక్షన్‌లో అజిత్‌ సినిమా వస్తే చూడటానికి నేనూ ఇష్టపడతాను. కానీ, భవిష్యత్తులో అయినా వీరి కాంబినేషన్‌లో ఒక ప్రాజెక్ట్‌ వస్తుందనే నమ్మకం కూడా నాకు లేదు.' అని సురేష్‌ చంద్ర తెలిపారు.

మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వంలో అజిత్‌ విడాముయ‌ర్చి సినిమాలో నటించారు. కొద్దిరోజుల క్రితమే ఈ ప్రాజెక్ట్‌ షూటింగ్‌ పూర్తి అయింది. దీపావళికి ఈ సినిమా విడుదల కానుందని ప్రచారం జరుగుతుంది. అధిక్ రవిచంద్రన్‌ డైరెక్షన్‌లో అజిత్‌ తర్వాతి సినిమా ఉంటుంది. ఇదిలా ఉంటే, ప్రశాంత్ త్వరలో జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి తన కొత్త సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement