పులి కడుపున పులే పుడుతుందంటారు. లెజెండరీ యాక్షన్ డైరెక్టర్ వీరు దేవ్‌గణ్ ఎన్నో సినిమాలకు స్టంట్ మాస్టర్‌గా చేశారు. కొన్ని చిత్రాలకు యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. తన శరీరంలో ఎన్ని ఎముకలు విరిగినా సరే ఏమాత్రం జంకకుండా ఎన్నో సినిమాలకు స్టంట్‌మెన్‌గా వ్యవహరించారు. తండ్రి ధైర్యమే కొడుక్కీ వచ్చింది.
ప్రాక్టీస్ చేయకుండా దూకేశాడు
బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గణ్ (Ajay Devgn) కూడా సాహసోపేతమైన సన్నివేశాలకు వెనకడుగు వేయడు. దేదే ప్యార్ దే 2లోనూ అలాంటి స్టంట్లు చేశాడు. 'విమానంలోనుంచి దూకే సన్నివేశం అది.. కనీసం ఒక్కసారి కూడా ప్రాక్టీస్ చేయకుండానే విమానంలో నుంచి సడన్‌గా దూకి స్కైడైవింగ్ చేశాడు' అని నటుడు మాధవన్ అజయ్ గురించి గొప్పగా చెప్పాడు.
కళ్ల ముందే ఓ ప్రాణం
ఇంతలో అజయ్ అందుకుంటూ.. నేను షూటింగ్ లొకేషన్‌కు వెళ్లగానే ఓ బాధాకర సంఘటన జరిగింది. నా కళ్లముందే ఒక వ్యక్తి పారాచూట్ పని చేయక లోయలో పడి చనిపోయాడు. తర్వాత నావంతు వచ్చింది. ఇది ప్రమాదకరమైనప్పటికీ నేనే రిస్క్ చేసి దూకుతున్నాను తప్ప ఎవరి బలవంతం లేదు అని ఓ వీడియో రికార్డ్ చేసి నా సీన్ పూర్తి చేశాను.
ఆ హీరోకీ తప్పలేదు!
హాలీవుడ్ స్టార్ లినార్డో డికాప్రియోకి కూడా ఈ లొకేషన్‌లో చేదు అనుభవం ఎదురైంది. ఒకసారి సినిమా షూటింగ్‌లో భాగంగా ఇక్కడే స్కైడైవింగ్ చేశాడు. అతడి పారాచూట్ పనిచేయకపోయేసరికి అక్కడున్న ఇన్‌స్ట్రక్టర్ వెంటనే దూకి అతడి ప్రాణాలు కాపాడాడు అని గుర్తు చేసుకున్నాడు.


