AHA Indian Idol: తెలుగు ఇండియన్‌ ఐడల్‌ 2.. ఆడిషన్స్‌ అక్కడే!

AHA Ready with Telugu Indian Idol Season 2, Audition Details - Sakshi

ఆహా మొదలైనప్పటినుంచి ప్రేక్షకుల కోసం వినోదాత్మక, ఉత్కంఠభరిత కంటెంట్‌ అందిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఎన్నో అద్భుతమైన ఒరిజినల్స్, రియాలిటీ షోలు ప్రసారమయ్యాయి. వీటికి అదనంగా తెలుగు ఇండియన్‌ ఐడల్‌ రియాలిటీ షోని ప్రవేశపెట్టింది. అద్భుతమైన ఆదరణ పొందిన ఈ రియాలిటీ షో త్వరలో రెండో సీజన్‌కు రెడీ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని పసందైన గళాల కోసం బ్రాండ్‌ న్యూ అవతార్‌లో తెలుగు ఇండియన్‌ ఐడల్‌ 2 రూపుదిద్దుకుంటోంది.

ఫస్ట్ సీజన్‌ ఇచ్చిన ఉత్సాహాన్ని రెట్టింపు చేసేలా, శ్రావ్యమైన గళాలను ప్రేక్షకులకు పరిచయం చేసేలా మరింత గ్రాండియర్‌గా రూపొందుతోంది సెకండ్‌ సీజన్‌. అన్‌స్టాపబుల్‌ 2లో ఈ షో గురించి అనౌన్స్ చేశారు నందమూరి బాలకృష్ణ. ఫస్ట్ సీజన్‌లో ఎస్‌ ఎస్‌ తమన్‌, నిత్యామీనన్‌, కార్తిక్‌ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. బీవీకే వాగ్దేవి ట్రోఫీ గెలుచుకున్నారు. శ్రీనివాస్‌, వైష్ణవి తొలి రెండు రన్నరప్‌ స్థానాల్లో నిలిచారు.

తెలుగు రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న శ్రావ్యమైన గళాలకు అద్భుత వేదికను ఏర్పాటు చేసి, ప్రపంచానికి పరిచయం చేయాలనే సదుద్దేశంతో ఈ షోని ప్లాన్‌ చేసింది ఆహా. 16 నుంచి 30 ఏళ్లలోపున్నవారు ఈ షోలో పాల్గొనవచ్చు. హైదరాబాద్‌, బషీర్‌బాగ్‌లోని సెయింట్‌ జార్జి గ్రామర్‌ హై స్కూల్లో జనవరి 29న ఈ ఆడిషన్స్ జరగనున్నాయి. ప్రతిభావంతులైన ఔత్సాహిక గాయనీగాయకులకు ఇదో సువర్ణావకాశం. మీరు నెక్స్ట్ తెలుగు ఇండియన్‌ ఐడల్‌ షోలో పాల్గొనాలనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? ఆడిషన్స్‌లో తప్పక పాల్గొనండి. వచ్చే సీజన్‌లో తెలుగు ఇండియన్‌ ఐడల్‌ ట్రోఫీ విజేతగా మిమ్మల్ని మీరు చూసుకోండి!

చదవండి: పెళ్లికి రెడీ అయిన కార్తీకదీపం నటి, పెళ్లిచూపులు వీడియోతో సర్‌ప్రైజ్‌
ఆస్తి కోసం చిన్న గొడవ.. ప్రేమించి పెళ్లాడిన భర్త వదిలేసి పోయాడు.. 30 ఏళ్లవుతోంది: నటి

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top