Shobha Shetty: నా బర్త్‌డే రోజే పెళ్లిచూపులు.. కార్తీకదీపం సీరియల్‌ నటి

TV Actress Shobha Shetty Shares Pelli Chupulu Video - Sakshi

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు శోభాశెట్టి. కార్తీకదీపం సీరియల్‌లో డాక్టర్‌బాబు, వంటలక్కను ముప్పుతిప్పలు పెట్టిన మోనితగా అందరికీ సుపరిచితురాలే! తన పాత్రతో అల్లాడించిన శోభా తాజాగా పెళ్లిపీటలెక్కబోతోంది. ఈ విషయాన్నే తనే స్వయంగా యూట్యూబ్‌ వీడియో ద్వారా వెల్లడించింది. 'నాకు తెలియకుండానే అమ్మ పెళ్లిచూపులు ఏర్పాటు చేసింది. ఆ అబ్బాయెవరో కూడా తెలియదు. పెళ్లి చూపులు అనే పదం చెప్పడానికే సిగ్గుగా ఉంది. ఫస్ట్‌ టైం సిగ్గుపడుతున్నానంటే నాకు పెళ్లికళ వచ్చేసింది. ఈరోజు నా బర్త్‌డే. ప్రతి ఏడాది ఈరోజు మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరుపుకుంటాం.

కానీ ఈసారి మా అమ్మ నాకు తెలియకుండా ఓ అబ్బాయిని చూసింది. అతడు నన్ను చూడటానికి ఈ రోజు మా ఇంటికొస్తున్నాడు. అందుకోసమే రెడీ అవుతున్నా' అంటూ సిగ్గుల మొగ్గయింది నటి. పక్కా ట్రెడిషనల్‌గా పెళ్లికూతురిలా అందంగా ముస్తాబైందీ శోభా. ఆరెంజ్‌ పట్టుచీరలో ధగధగ మెరిసిపోయింది. ఇంటిని సైతం డెకరేట్‌ చేయడమే కాకుండా గేటు ముందు టెంట్‌ వేసి పెళ్లిచూపులకు వచ్చినవారికి విందు ఏర్పాట్లు కూడా చేశారు. మొత్తానికి శోభాతో ఏడడుగులు నడిచే ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలనుందంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

చదవండి: నాది లవ్‌ మ్యారేజ్‌.. భర్త బతికున్నాడో, లేదో కూడా తెలీదు: నటి

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top