Prabhas Starrer Adipurush Theatrical Rights In Telugu States Sold At Whopping Price, Details Inside - Sakshi
Sakshi News home page

Adipurush Movie: తెలుగు రాష్ట్రాల్లో భారీ ధరకు ఆదిపురుష్ థియేట్రికల్ రైట్స్..!

May 29 2023 3:45 PM | Updated on May 29 2023 4:13 PM

Adipurush theatrical rights in Telugu sold for more than Rs 100 crores - Sakshi

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ ఫిల్మ్ 'ఆదిపురుష్'. ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్నారు.  ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనుండగా.. సీతగా కృతి సనన్ నటించింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలో నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 16న విడుదల కానుంది. 

(ఇది చదవండి: ప్రభాస్ ఆదిపురుష్.. ఆ సాంగ్ వచ్చేసింది)

అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆదిపురుష్ థియేట్రికల్ రైట్స్ దాదాపు రూ. 150కి పైగా కోట్ల రూపాయలకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ ధరకు అమ్ముడైనట్లు సమాచారం. థియేట్రికల్ హక్కులను పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి విక్రయించినట్లు తెలుస్తోంది. అదే నిజమైతే ఈ చిత్రం నాన్-థియేట్రికల్ వసూళ్ల పరంగా కొత్త బెంచ్‌మార్క్‌ను సృష్టిస్తుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

(ఇది చదవండి: పెళ్లైన ఐదేళ్లకు ప్రెగ్నెన్సీ.. నటి షాకింగ్ నిర్ణయం!)

Advertisement
 
Advertisement
Advertisement