Prabhas Adipurush Song 'Jai Shri Ram' Released Today - Sakshi
Sakshi News home page

Adipurush Movie: 'ఎవరు ఎదురు రాగలరు మీ దారికి'.. జై శ్రీరామ్ సాంగ్ రిలీజ్

Published Sat, May 20 2023 5:06 PM

Prabhas Latest Movie Adipurush Jai Sriram Song Release Today - Sakshi

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ ఫిల్మ్ 'ఆదిపురుష్'. ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ మూవీ ట్రైలర్‌కు ప్రేక్షకుల మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనుండగా.. సీతగా కృతి సనన్ నటించింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలో నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి తాజాగా  జై శ్రీరామ్ అనే సాంగ్‌ను రిలీజ్ చేశారు.

(ఇది చదవండి: కాల్పుల్లో అభిమాని మృతి.. సూర్య భావోద్వేగ లేఖ)

'ఎవరు ఎదురు రాగలరు మీ దారికి.. ఎవరుకుంది ఆ అధికారం.. పర్వతా పాదాలు వణికి కదులుతాయి మీ హుంకారానికి' అంటూ పాట ప్రారంభంలో ప్రభాస్ చెప్పే డైలాగ్‌ విపరీతంగా ఆకట్టుకుంటోంది.  జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాజా రామ్ అంటూ సాగే ఈ పాటకు అజయ్ - అతుల్ ద్వయం స్వరాలు సమకూర్చగా..  ఈ గీతాన్ని రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. రావణుడితో యుద్ధానికి సన్నద్ధయ్యే సందర్భంలో ఈ సాంగ్ ఉన్నట్లు కనిపిస్తోంది. కాగా.. ఈ చిత్రం జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో సన్నీ సింగ్, దేవదత్త నాగే, వత్సల్ సేన్, సోనాల్ చౌహాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. 


 

Advertisement
Advertisement