Adipurush Box Office Collection Day 5 Worldwide - Sakshi
Sakshi News home page

Adipurush Day 5 Collection: 'ఆదిపురుష్'కి ఐదు రోజుల్లో వచ్చింది ఎంత?

Jun 21 2023 9:50 AM | Updated on Jun 21 2023 12:16 PM

Adipurush Day 5 Collection Worldwide - Sakshi

డార్లింగ్ ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమా బాక్సాఫీస్ దగ్గర పడుతూ లేస్తూ వెళ్తోంది. మంచి హైప్ తో విడుదలైన ఈ చిత్రం.. తొలి మూడురోజుల్లో అద్భుతమైన వసూళ్లు సాధించింది. రూ.340 కోట్ల వరకు సొంతం చేసుకుంది. నాలుగో రోజుకి మాత్రం అనుహ్యరీతిలో కలెక్షన్స్ తగ్గిపోయాయి. ఇప్పుడు ఐదోరోజు కూడా మరింతగా తగ్గిపోయాయి. ఇంతకీ 'ఆదిపురుష్' ఓవరాల్ కలెక్షన్స్ ఎంత? అసలేం జరుగుతుంది?

(ఇదీ చదవండి: 'ఆదిపురుష్' రిజల్ట్ ముందే పసిగట్టిన ప్రభాస్.. ఆ వీడియో వైరల్!)

కలెక్షన్స్ ఎంత?
ఓ మాదిరి హైప్ తో రిలీజైన 'ఆదిపురుష్'.. తొలిరోజు రూ.140 కోట్ల వసూళ్లు సాధించింది. ఓ విధంగా చెప్పాలంటే మంచి ఆరంభం అని చెప్పొచ్చు. శనివారం, ఆదివారం కూడా బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించిన ఈ సినిమా చెరో రూ.100 కోట్లు సాధించింది. దీంతో మూడు రోజుల్లో రూ.340 కోట్లు వచ్చాయి. నాలుగో రోజు మాత్రం కేవలం రూ.35 కోట్లు రావడం అందరినీ షాకయ్యేలా చేసింది. ఐదోరోజు మన దేశంలో కేవలం రూ.10 కోట్ల మాత్రమే నెట్ వసూళ్లు వచ్చినట్లు సమాచారం. గ్రాస్ తో కలిపి రూ.20 కోట్లు వచ్చాయి. దీన్నిబట్టి ఓవరాల్ గా ఐదు రోజుల్లో రూ.395 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుంది. 

తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి?
'ఆదిపురుష్' వసూళ్లు తెలుగు రాష్ట్రాల్లో నిలకడగా సాగుతున్నాయి. మిగతా చిత్రాలకు ఇలా నిలకడగా ఉంటే పర్లేదు గానీ 'ఆదిపురుష్' విషయంలో ఇలా జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఆంధ్రా-తెలంగాణలో కలిపి ఐదు రోజుల్లో రూ.75.70 కోట్ల షేర్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వెర్షన్ షేర్ రూ.95 కోట్లు అని సమాచారం. మరింతగా పుంజుకోవాల్సిన రెండో వారంలో ఇలా డ్రాప్ కనిపిస్తుండటం ట్రేడ్ వర్గాల్ని కలవరపెడుతోంది. 

(ఇదీ చదవండి: మెగా ఫ్యామిలీకి సెంటిమెంట్‌గా మారుతున్న ఆ పేరు!?)

Advertisement
 
Advertisement
Advertisement