Adil Khan Durrani Finally Confirms Wedding with Rakhi Sawant - Sakshi
Sakshi News home page

రాఖీ సావంత్‌తో పెళ్లి.. ప్లేట్ ఫిరాయించిన ప్రియుడు

Jan 16 2023 3:21 PM | Updated on Jan 16 2023 3:58 PM

Adil Khan Durrani finally confirms wedding with Rakhi Sawant - Sakshi

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌, బాలీవుడ్ నటి రాఖీసావంత్‌ వివాహం కీలక మలుపు తిరిగింది. మొదట ఈ పెళ్లి ఫేక్ అని కొట్టి పారేసిన ఆమె ప్రియుడు ఆదిల్ ప్లేట్ ఫిరాయించాడు. ఆమెతో వివాహం జరిగిన మాట వాస్తవమేనని తాజాగా అంగీకరించారు. తన ప్రియుడు ఆదిల్‌ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న ఫోటోలు ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరలైన సంగతి తెలిసిందే.  కానీ ఈ పెళ్లి ఫేక్ అంటూ ఆదిల్ ప్రకటన చేయడంపై రాఖీ బోరున విలపిస్తూ మీడియా ముందు తన బాధను వ్యక్తం చేసింది. 

(ఇది చదవండి: 'పది రోజుల్లో నా పరువు తిరిగొస్తుందా'.. బోరున ఏడ్చేసిన నటి)

ఆదిల్ ఖాన్ దురానీ జులై 2022లోనే పెళ్లి చేసుకున్నట్లు రాఖీ సావంత్ ఇటీవల మీడియాతో వెల్లడించింది. ఆదిల్ ఫేక్ అంటూ చేసిన ప్రకటనపై కన్నీటి పర్యంతమైంది. రాఖీ జీవితంలో ఈ షాకింగ్ ట్విస్ట్‌ల తర్వాత.. ఆమె భర్త ఆదిల్ ఖాన్ ఎట్టకేలకు వివాహం చేసుకున్నట్లు ధృవీకరించారు. ఈ విషయాన్ని ఆదిల్ తన ఇన్‌,స్టా ద్వారా వెల్లడించారు. ఆదిల్ తన ఇన్‌స్టాగ్రామ్ రాఖీతో తన పెళ్లికి సంబంధించిన ఫోటోను పంచుకున్నారు. ఆమెతో వివాహం చేసుకోనని తాను ఎప్పుడూ చెప్పలేదని పేర్కొన్నాడు. రాఖీని తాను ముద్దుపేరుతో కూడా పిలుస్తానని తెలిపారు. 

ఆదిల్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. ' చివరగా ఇవాళ ప్రకటన వచ్చింది. నేను వివాహం చేసుకోనని రాఖీతో ఎప్పుడూ చెప్పలేదు. కేవలం కొన్ని విషయాలను చర్చించాల్సి వచ్చింది. అందుకే నిశ్శబ్దంగా ఉండవలసి వచ్చింది. మనకు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రాఖీ (పప్పుడి).' అంటూ పోస్ట్ చేశారు. ఈ చూసిన వెంటనే రాఖీ స్పందిస్తూ "ధన్యవాదాలు జాన్" అంటూ రిప్లై ఇచ్చింది. దీనికి మరో నటి దేవోలీనా భట్టాచార్జీ కూడా వీరి పెళ్లికి శుభాకాంక్షలు తెలిపారు. 


 

Advertisement
 
Advertisement
Advertisement