సాయితేజ్-స్వాతి.. ఆ విషయం ఇప్పుడు బయటపెట్టారు! | Actress Swathi Gives Kiss To Sai Dharam Tej At Month Of Madhu Trailer Launch Event; Video Viral - Sakshi
Sakshi News home page

Swathi Reddy-Saidharam Tej: మెగాహీరోకి స్టేజీపై ముద్దుపెట్టిన హీరోయిన్ స్వాతి

Published Tue, Sep 26 2023 4:24 PM | Last Updated on Tue, Sep 26 2023 5:10 PM

Actress Swathi Kiss Sai Dharam Tej On Stage - Sakshi

మెగాహీరో సాయిధరమ్ తేజ్‌ని హీరోయిన్ స్వాతి స్టేజీపై ముద్దుపెట్టుకుంది. అయితే వీళ్లిద్దరూ యాక్టర్స్ అని, టాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నారని చాలామందికి తెలుసు. కలిసి కూడా ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. అయితే తాజాగా జరిగిన ఓ ఈవెంట్‌లో తమ బాండింగ్ గురించి చెబుతూనే ఎవరికీ తెలియని ఓ విషయాన్ని బయటపెట్టారు. ఇప్పుడు ఇది ఆసక్తి కలిగిస్తోంది.

కలర్స్ టాక్ షోతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన స్వాతి.. 'అష్టాచమ్మా' సినిమాతో హీరోయిన్ అయిపోయింది. కొన్నాళ్ల పాటు పలు చిత్రాలు చేసింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని, నటనకు కాస్త బ్రేక్ ఇచ్చింది. కొన్నాళ్ల ముందే రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టేసింది. ఈమె హీరోయిన్‌గా నటించిన 'మంత్ ఆఫ్ మధు' మూవీ అక్టోబరు 6న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్ వేడుకని మంగళవారం నిర్వహించారు. దీనికి గెస్ట్‌గా వచ్చిన మెగాహీరో సాయితేజ్.. స్వాతి గురించి పలు విషయాలు రివీల్ చేశాడు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 37 సినిమాలు)

'స్వాతి గురించి చెప్పాలంటే మీ అందరికీ కలర్స్ స్వాతి. కానీ నాకు మాత్రం స్వాతిగాడు. ఎందుకంటే కాలేజీ రోజుల నుంచే స్వాతి నాకు బెస్ట్ ఫ్రెండ్. కలర్స్ స్వాతిగా మొదలై స్వాతి అయింది. ఆ తర్వాత స‍్వాతిగాడు అయింది. ఈ మూవీ స్వాతికి మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్త్ స్వాతి' అని సాయిధరమ్ తేజ్ చెప్పాడు. ఆ వెంటనే ఇతడిని హగ్ చేసుకున‍్న స్వాతి బుగ్గపై ముద్దుపెట్టింది.

ఇక స్వాతి మాట్లాడుతూ.. 'మేం ఇద్దరం కలిసి చదువుకున్నాం. సినిమాల్లోకి నేను ముందే వచ్చేశాను కాబట్టి తనకంటే పెద్దదాన్ని అని మీరందరూ అనుకుంటున్నారేమో. కానీ మా ఇద్దరికీ ఒకే ఏజ్(వయసు). ఒకే కాలేజీలో డిగ్రీ చేశాం. ఎగ్జామ్స్ లో నేను చూపిస్తేనే పాసయ్యాడు(నవ్వుతూ). ఏడాదిగా కలిసి 'సత్య' అనే ప్రాజెక్ట్ చేశాం. తేజూ నా జీవితంలో ఎప్పుడూ సపోర్ట్ సిస్టంలా ఉంటూ వస్తున్నాడు. థాంక్యూ తేజు' అని అతడితో బాండింగ్ గురించి చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: కలర్స్ స్వాతి విడాకుల రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement