Actress Sri Gouri Priya Getting Offers In Kollywood - Sakshi
Sakshi News home page

Sri Gouri Priya: మిస్‌ హైదరాబాద్‌ టూ హీరోయిన్‌..  తెలుగమ్మాయి అయినా తమిళంలో ఆఫర్లు

May 27 2023 8:48 AM | Updated on May 27 2023 9:07 AM

Actress Sri Gouri Priya Getting Offers In Kollywood - Sakshi

ఏ రంగంలోనైనా ప్రతిభే ప్రామాణికం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా సినీ రంగంలో ప్రతిభకు ఎప్పుడు పెద్దపేట వేస్తారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది అంతే. నటి శ్రీగౌరీప్రియ ప్రస్తుతం అలాంటి ప్రయత్నంలోనే ఉంది. మిస్‌ హైదరాబాద్‌ అందాల పోటీల్లో కిరీటాన్ని గెలుచుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు నటిగా కోలీవుడ్లో బాగా వేస్తోంది.

ఇప్పటికే తెలుగులో రైటర్‌ పద్మభూషణ్‌ చిత్రంలో నటించి సినీ ప్రముఖుల ప్రశంసలను, ఓటీటీ వీక్షకుల ఆదరణ పొందిన ఈమె ఇటీవల కోలీవుడ్‌లోకి రంగప్రవేశం చేసింది. ఆంథాలజీ చిత్రం మోడరన్‌ లవ్‌ చైన్నెలో లాల్గుండ బొమ్మైగళ్‌ అనే అధ్యాయంలో శోభ పాత్రలో నటించింది. దీనికి రాజు మురుగన్‌ కథ, దర్శకత్వం నిర్వహించారు. ఈ ఆంథాలజీ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌ టైంలో స్ట్రీమింగ్‌ అవుతోంది.

ఇందులో నటి గౌరీ ప్రియ తాంబూయిష్‌ యువతిగా చాలా మృదువైన పాత్రలో నటించి అటు ప్రేక్షకులు, ఇటు విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. నటి గౌరీప్రియ సహజమైన నటన, ఆకర్షణీయమైన రూపం సినీ వర్గాలను ఆకట్టుకుంటోంది. దీంతో ఈమెకు తమిళంలో పలు అవకాశాలు వస్తున్నాయట. వాటికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉందని శ్రీగౌరీప్రియ వర్గాలు పేర్కొన్నాయి.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement