మెగా ఫోన్‌ పట్టిన హీరోయిన్‌.. వరుణ్‌తో సినిమా! | Actress ShagnaSri Venun Turns As A Director, Now Making Debut With Heart Touching Love Story Features Varun Sandesh | Sakshi
Sakshi News home page

మెగా ఫోన్‌ పట్టిన హీరోయిన్‌.. వరుణ్‌తో సినిమా!

Dec 26 2025 1:55 PM | Updated on Dec 26 2025 2:36 PM

Actress ShagnaSri Venun Turns As A Director

టాలీవుడ్‌ హీరోయిన్లలో మల్టీపుల్‌ టాలెంట్‌ ఉన్నవారు కుడా ఉన్నారు. నటించడమే కాదు సినిమాను తెరకెక్కించే ప్రతిభావంతులు కూడా తెలుగు పరిశ్రమలో ఉన్నారు. ఇప్పటికే విజయ నిర్మల, జీవితతో సహా పలువురు హీరోయిన్లు దర్శకులుగా మారి బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ అందించారు. తాజాగా మరో హీరోయిన్‌ మెగా ఫోన్‌ పట్టింది. ఆమే  షగ్న శ్రీ వేణున్. ప్రభుత్వ జూనియర్ కళాశాల సినిమాతో హీరోయిన్ మెప్పించిన షగ్న.. తాజాగా ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తోంది. ఇందులో వరుణ్‌ సందేశ్‌ హీరోగా నటిస్తున్నాడు. 

ఎస్ 2ఎస్ సినిమాస్ బ్యానర్ పై  ప్రొడక్షన్ నెంబర్ 2గా తెరకెక్కుతున్న ఈ మూవీ పోస్టర్‌ని తాజాగా రిలీజ్‌ చేశారు. పోస్టర్‌లో ఒక బ్లాక్ డ్రెస్ ధరించిన యువ జంట చేతిలో రోజా పూలతో ఉండటం, మరో యువకుడు ఈ జంటలోని యువతి చేయి పట్టుకుని కనిపిస్తుండటం ఆసక్తి కలిగిస్తోంది. 

ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మార్చిలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. త్వరలోనే ఈ సినిమా టైటిల్ ను మేకర్స్ అనౌన్స్ చేయబోతున్నారు. హార్ట్ టచింగ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో  షగ్న శ్రీ వేణున్ హీరోయిన్‌గా కూడా నటిస్తుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement