
బాలీవుడ్ హీరోయిన్ సంగీత బిజ్లానీ (Sangeeta Bijlani) ఫామ్‌హౌస్‌లో దొంగతనం జరిగింది. మహారాష్ట్ర.. పుణెలోని మావల్‌లో ఉన్న ఫామ్ హౌస్‌కు నాలుగు నెలల తర్వాత వెళ్లిన సంగీత.. అక్కడి పరిస్థితి చూసి షాకైంది. తన ఇంటి తలుపులు, కిటికీలు ధ్వంసమవడాన్ని చూసి దొంగతనం జరిగిందని నిర్ధారించుకుంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వస్తువులు ధ్వంసం
తన ఫామ్‌హౌస్‌లోకి ఎవరో అక్రమంగా చొరబడి కొన్ని వస్తువులను ఎత్తుకెళ్లారని, మరికొన్నింటిని ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొంది. పై అంతస్తులో బెడ్స్, ఫ్రిజ్ నాశనం చేశారని, విలువైన వస్తువులు కనిపించడం లేదని తెలిపింది. సీసీటీవీని కూడా ధ్వంసం చేశారని వాపోయింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో కొంతకాలంగా ఫామ్‌హౌస్‌కు రాలేదని తెలిపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పర్సనల్ లైఫ్
సంగీత.. త్రిదేవ్, ఇన్‌స్పెక్టర్ ధనుష్, యోధ, ఇజ్జత్, శివరామ్, లక్ష్మణరేఖ, విష్ణుదేవ.. ఇలా అనేక సినిమాలు చేసింది. ఇటీవలే ఆమె 65వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. బాంద్రాలోని తన నివాసంలో జరిగిన ఈ బర్త్‌డే పార్టీకి సంగీత మాజీ ప్రియుడు, ప్రస్తుత స్నేహితుడు సల్మాన్ ఖాన్ కూడా హాజరయ్యాడు. నిజానికి సంగీత, సల్మాన్ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. మంచి ముహూర్తం చూసుకుని పత్రికలు కూడా అచ్చువేయించుకున్నారు. కానీ పెళ్లి పీటలు ఎక్కకముందే ఆ వివాహం రద్దయింది. అనంతరం సంగీత 1996లో మహ్మద్ అజారుద్దీన్‌ను పెళ్లి చేసుకుంది. 2019లో వీరు విడాకులు తీసుకున్నారు.