Samantha Ruth Prabhu Files Defamation Case on 3 Youtube Channels - Sakshi
Sakshi News home page

Samantha: మూడు యూట్యూబ్‌ చానళ్లపై పరువు నష్టం దావా

Oct 20 2021 4:15 PM | Updated on Oct 20 2021 6:05 PM

Actress Samantha Files Defamation Case On 3 Youtube Channels In Kukatpally Court - Sakshi

Samantha Files Defamation Case On 3 Youtube Channels: టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ సమంత కోర్టును ఆశ్రయించారు. తన పరువుకు భంగం కలిగేలా వ్యవహరించిన మూడు యూట్యూబ్‌ ఛానల్స్‌పై బుధవారం కూకట్‌పల్లి కోర్టులో పరువు నష్టం దావా పిటిషన్‌ దాఖలు చేశారు. సుమన్‌ టీవీ, తెలుగు పాపులర్‌ టీవీ, మరో చానల్‌తో పాటు సీఎల్‌ వెంకట్రావు అనే అడ్వకేట్‌పై సమంత కోర్టులో పిల్ దాఖలు చేశారు. తన వ్యక్తి గత జీవితం గురించి అభ్యంతరకర వీడియోలు, కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని, వీటి వల్ల తన గౌరవానికి భంగం వాటిల్లుతోందని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇక సమంత పిటిషన్‌పై నేడు కూకట్‌పల్లి కోర్టులో విచారణ జరుగనుంది. సమంత తరుపున హైకోర్టు న్యాయవాది బాలాజీ మరికాసేపట్లో కోర్టులో వాదనలు వినిపించనున్నారు.

చదవండి: వీకెండ్‌ ఇలా అద్భుతంగా గడిచింది: సమంత

కాగా ఇటీవల సమంత, నాగ చైతన్యతో వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. సామ్‌, చై నిర్ణయంతో అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే సమంత తన విడాకుల విషయం ప్రకటించినప్పటి నుంచి ఆమెపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్, రూమర్స్‌ వస్తున్నాయి. ఈ క్రమంలో తన పరువు ప్రతిష్టలను నష్టం వాటిల్లే విధంగా వ్యవహరించిన మూడు యూట్యూబ్‌ చానల్స్‌పై సమంత కూకట్‌పల్లి కోర్టులో పరువు నష్టం దావా కేసు వేశారు.

చదవండి: ఘనంగా ముక్కు అవినాష్‌ పెళ్లి, ‘బ్లండర్‌ మిస్టేక్‌’ అంటూ వీడియో బయటికి!

Advertisement
 
Advertisement
Advertisement