సాయిపల్లవి బాలీవుడ్‌ ఎంట్రీ ఫిక్స్‌! | Actress Sai Pallavi To Make Her Bollywood Entry With Aamir Khan Son, Rumours Goes Viral - Sakshi
Sakshi News home page

సాయిపల్లవి బాలీవుడ్‌ ఎంట్రీ ఫిక్స్‌!

Published Fri, Sep 15 2023 5:15 AM

Actress Sai Pallavi Bollywood Entry - Sakshi

దక్షిణాదిలోని అగ్రకథానాయికల్లో ఒకరిగా ప్రేక్షకుల్లో పేరు సంపాదించుకున్నారు సాయిపల్లవి. ఈ బ్యూటీ బాలీవుడ్‌ ఎంట్రీ గురించి ఎప్పటికప్పుడు కొత్త వార్తలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. ఈ కోవలోనే తాజాగా మరోసారి సాయిపల్లవి బాలీవుడ్‌ ఎంట్రీ బీ టౌన్‌లో చర్చనీయాంశమైంది. ఆమిర్‌ ఖాన్‌ తనయుడు జునైద్‌ ఖాన్‌ ఇటీవల ఓ ప్రేమకథకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారని, ఈ చిత్రంలోనే సాయిపల్లవి హీరోయిన్‌గా నటించనున్నారనే టాక్‌ హిందీ పరిశ్రమలో ప్రచారంలోకి వచ్చింది.

ఆమిర్‌ సన్నిహితుల్లో ఒకరైన సునీల్‌ పాండే దర్శకత్వం వహిస్తారని, ఈ ఏడాది చివర్లోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని భోగట్టా. ఇక ఈ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తే, హిందీలో ఆమెకు తొలి చిత్రం అవుతుంది. మరి.. సాయిపల్లవిని బాలీవుడ్‌ భులాయా (పిలిచిందా?) లేదా అనేది తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే. 

Advertisement
 
Advertisement
 
Advertisement