'అనుకోకుండా ప్రేమలో పడిపోయా'.. రేణు దేశాయ్ పోస్ట్ వైరల్! | Actress Renu Desai Instagram Post Goes Viral On movie | Sakshi
Sakshi News home page

Renu Desai: బరువెక్కిన హృదయంతో ఈ మాట చెప్పడం లేదు: రేణు దేశాయ్ పోస్ట్ వైరల్!

Dec 6 2023 1:54 PM | Updated on Dec 6 2023 3:07 PM

Actress Renu Desai Instagram Post Goes Viral On movie - Sakshi

టాలీవు డ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన చిత్రం యానిమల్. డిసెంబర్ 1న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ షేక్ చేస్తోంది. కేవలం ఐదు రోజుల్లోనే రూ.500 కోట్లకు చేరువగా వసూళ్లు సాధించింది. దేశవ్యాప్తంగా ఈ చిత్రంపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. రణ్‌బీర్‌ కపూర్, రష్మిక మందన్నా నటించిన ఈ సినిమా మొదటి రోజే హిట్ టాక్ సొంతం చేసుకుంది.  ఇప్పటికే ఈ చిత్రంపై రాం గోపాల్ వర్మ ఏకంగా నాలుగు పేజీల రివ్యూను రిలీజ్ చేశారు. దీంతో ఈ మూవీ వీకెండ్ తర్వాత వసూళ్ల పరంగా ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఈ మూవీ చూసిన రేణ్ దేశాయ్ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఇంతకీ ఆమె ఏమన్నారో తెలుసుకుందాం. 

రేణ్ దేశాయ్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'ఎట్టకేలకు సందీప్ రెడ్డి యానిమల్ సినిమా చూడాల్సి వచ్చింది. సినిమా చూశా నిస్సందేహంగా ప్రేమలో పడ్డాను. ఈ చిత్రంలో అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయి.  మీరు ఏదైనా ప్రత్యేకమైన అనుభూతిని పొందాలనుకుంటే ఈ సినిమాను కచ్చితంగా థియేటర్‌లో చూడటం మిస్ అవ్వకండి. ' అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం రేణు దేశాయ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. చాలా ఏళ్ల తర్వాత రేణు దేశాయ్  రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో కీలక పాత్రలో కనిపించింది. 

Advertisement
 
Advertisement
Advertisement