
తెలుగులో బోలెడంత మంది హీరోయిన్లు. వాళ్లలో కేరళకు చెందిన చాలామంది అమ్మాయిలు ఉన్నారు. మన సినిమాల్లో వీళ్లు అవకాశాలు దక్కించుకుంటూ అదరగొట్టేస్తున్నారు. ఈమె కూడా అలా వచ్చిన బ్యూటీనే. దాదాపు పదేళ్లుగా తెలుగులో నటిస్తోంది. ఇంతలా చెప్పాం కదా ఈ నటి ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?
(ఇదీ చదవండి: సడన్ సర్ ప్రైజ్.. ఓటీటీలోకి తమన్నా 'ఓదెల 2')
పైన ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ పేరు మాళవిక నాయర్. మలయాళీ ఫ్యామిలీకి చెందిన ఈమె.. ఢిల్లీలో పుట్టింది. కొంతవరకు కేరళలో, డిగ్రీ హైదరాబాద్ లో పూర్తి చేసింది. మోడల్ గా పనిచేసిన ఈమెకు 2012లో తొలి ఛాన్స్ ఓ మలయాళ సినిమాలో వచ్చింది. 2015 రిలీజైన 'ఎవడే సుబ్రమణ్యం'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.
ఈ చిత్రంలో నంది అనే పాత్రలో ఆకట్టుకున్న మాళవిక.. దీని తర్వాత కళ్యాణ వైభోగమే, మహానటి, ట్యాక్సీవాలా, అన్నీ మంచి శకునములే, కల్కి 2898 ఏడీ తదితర చిత్రాల్లో నటించింది. నాగ్ అశ్విన్ తొలి మూవీలో నటించిన ఈమె.. అనంతరం అతడు తీసిన మహానటి, కల్కి చిత్రాల్లో అతిథి పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. తాజాగా ఈమె తన చిన్ననాటి ఫొటో పోస్ట్ చేసింది. అదే పైన కనిపిస్తున్న ఫొటో.
(ఇదీ చదవండి: 'న్యూ బిగినింగ్స్'.. మళ్లీ జంటగా కనిపించిన సమంత)