నేను నివసించని ఇంటికి రూ.1 లక్ష కరెంట్‌ బిల్లు.. షాకయ్యా: కంగనా | Actress Kangana Ranaut Stunned By Rs 1 lakh Electricity Bill For Her Manali Home, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

Kangana Ranaut: నేను నివసించని ఇంటికి రూ.1 లక్ష కరెంట్‌ బిల్లు.. ఇదెక్కడి విచిత్రం?

Apr 9 2025 10:55 AM | Updated on Apr 9 2025 11:12 AM

Actress Kangana Ranaut Stunned by Rs 1 lakh Electricity bill for Manali Home

నా ఇంటి కరెంట్‌ బిల్లు రూ.1 లక్ష అంటోంది బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ (Kangana Ranaut). హిమాచల్‌ ప్రదేశ్‌ మనాలీలో ఉన్న తన ఇంటికి లక్ష రూపాయల బిల్లు ఎలా వేశారని అధికారులపై మండిపడుతోంది. తనసలు నివాసమే ఉండని ఇంటికి ఎడాపెడా బిల్లు వేసిన ప్రభుత్వాన్ని తూర్పారబట్టింది.

షాకయ్యా..
ఈ మేరకు మండిలో జరిగిన ఓ కార్యక్రమంలో కంగనా మాట్లాడుతూ.. మనాలీలో ఉన్న నా ఇంటికి రూ.1 లక్ష కరెంట్‌ బిల్లు వేశారు. నేను నివసించని ఇంటికి ఈ రేంజ్‌లో వచ్చిన బిల్లు చూసి షాకయ్యాను. ఒకరకంగా చెప్పాలంటే ప్రభుత్వ చర్యకు సిగ్గుపడుతున్నాను. సోదరసోదరీమణులారా.. మన రాష్ట్రాన్ని, దేశాన్ని ప్రగతి పథంలో నడిపించడం మనందరి బాధ్యత. అలా చేయాలంటే ఇలాంటి తోడేళ్ల నుంచి మన రాష్ట్రానికి విముక్తి కల్పించాలి అని చెప్పుకొచ్చింది. ఇకపోతే హిమాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉంది.

సినిమా
కంగనా విషయానికి వస్తే.. ఈమె చివరగా నటించిన చిత్రం ఎమర్జెన్సీ. ఈ మూవీలో ప్రధాన పాత్రలో నటించడంతో పాటు తొలిసారి దర్శకురాలి అవతారమెత్తింది. అంతేకాక తన సినిమాను తనే నిర్మించింది. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో విధించిన ఎమర్జెన్సీ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. బాక్సాఫీస్‌ వద్ద రాణించలేకపోయిన ఈ మూవీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.

చదవండి: అల్లు అర్జున్ కోసం 20 ఏళ్ల కుర్రాడు.. ఎవరీ సాయి?

Advertisement
 
Advertisement
Advertisement