చిల్లర లేదన్న నటి.. యాచకుడి మాటలకు షాక్‌! | Actress Hina Khan Shocked As Beggar Asks Her To Make Online Payment | Sakshi
Sakshi News home page

'అమ్మా..ధర్మం చేయండమ్మా..' డబ్బుల్లేవంటే అతడేమన్నాడో తెలుసా?

Mar 25 2024 4:52 PM | Updated on Mar 25 2024 5:51 PM

Actress Hina Khan Shocked As Beggar Asks Her To Make Online Payment - Sakshi

ఈరోజు ఉదయం నుంచి బోణీ కాలేదు.. ఇంట్లో తమ్ముడు, చెల్లె ఉన్నారు అంటూ అభ్యర్థించాడు. నిజంగానే నా దగ్గర డబ్బుల్లేవు.. అంటూ సారీ కూడా చెప్పాను. అతడు వెంటనే

అమ్మా.. ధర్మం చేయండమ్మా.. బాబూ, దానం చేయండయ్యా.. అంటూ ప్లేటు పట్టుకుని తిరిగే యాచకులు ఎందరో! చిల్లర లేదని చెప్పినా సరే కొందరు వినిపించుకోకుండా డబ్బులివ్వమని పట్టుపడతారు. ఇచ్చేవరకు వదిలిపెట్టరు. అయితే బిగ్‌బాస్‌ బ్యూటీ, నటి హీనా ఖాన్‌కు దాదాపు ఇలాంటి పరిస్థితే ఎదురైందట.

డబ్బులివ్వమన్నాడు
'నేను కారులో వెళ్తున్నప్పుడు ఓ జంక్షన్‌ వద్ద రెడ్‌ సిగ్నల్‌ పడింది. గ్రీన్‌ సిగ్నల్‌ కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఓ వ్యక్తి నా కారు విండో తట్టాడు. డబ్బులివ్వమని అడిగాడు. అయ్యో, నా దగ్గర క్యాష్‌ లేదని బదులిచ్చాను. అతడు వెంటనే.. ఈరోజు ఉదయం నుంచి బోణీ కాలేదు.. ఇంట్లో తమ్ముడు, చెల్లె ఉన్నారు అంటూ అభ్యర్థించాడు. నిజంగానే నా దగ్గర డబ్బుల్లేవు.. అంటూ సారీ కూడా చెప్పాను. అతడు వెంటనే గూగుల్‌ పే చేయండంటూ తన నెంబర్‌ ఇచ్చాడు. నేను ఒక్కసారిగా షాకయ్యాను.

వారానికి సరిపడా
ఒక వారం రేషన్‌కు సరిపడా డబ్బులు పంపమని చెప్పాడు. వెంటనే అతడికి అవసరమయ్యేంత డబ్బు యూపీఐ ద్వారా పంపించాను. కానీ నిజంగానే సర్‌ప్రైజ్‌ కదా.. డిజిటల్‌ ఇండియా అంటే ఇదేనేమో!' అని చెప్పుకొచ్చింది. హీనా ఖాన్‌.. యే రిష్తా క్యా కెహ్లాతా హై సీరియల్‌తో గుర్తింపు పొందింది. ఖత్రాన్‌ కె ఖిలాడీ 8వ సీజన్‌లో పాల్గొని ఫస్ట్‌ రన్నరప్‌గా నిలిచింది. హిందీ బిగ్‌బాస్‌ 11వ సీజన్‌లోనూ పార్టిసిపేట్‌ చేసింది. కసౌటి జిందగీ కే, నాగిన్‌ (5వ సీజన్‌) సీరియల్స్‌లో ముఖ్య పాత్ర పోషించింది.

చదవండి: పిచ్చి కుక్కలా జైల్లో వేద్దామనుకున్నారంటూ నటి ఆవేదన.. గీతూ రాయల్‌పై పరువునష్టం దావా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement