రూ. 9 కోట్ల మోసం.. ఫోటోలతో స్పందించిన అషురెడ్డి | Actress Ashu Reddy Reaction Her Police Case Issue | Sakshi
Sakshi News home page

రూ. 9 కోట్ల మోసం.. ఫోటోలతో స్పందించిన అషురెడ్డి

Apr 26 2026 11:40 AM | Updated on Apr 26 2026 1:11 PM

Actress Ashu Reddy Reaction Her Police Case Issue

బిగ్‌బాస్‌ ఫేమ్‌, సినీనటి అషురెడ్డి తనపై నమోదైన కేసు గురించి సోషల్‌మీడియా ద్వారా స్పందించింది. తన ప్రమేయం లేకుండా తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఒక పోస్ట్‌ చేసింది. ఆపై ఆమె పలు ఫోటోలను షేర్‌ చేసింది. కొద్దిరోజుల క్రితం ఆమె కొల్హాపూర్‌ లక్ష్మీదేవి క్షేత్రం దర్శించుకున్న దృశ్యాలను  పంచుకుంది. అయితే, అందులో అమ్మవారికి సమర్పించిందేకు కొబ్బరికాయ, పూలు, పసుపు, కుంకుమ, మెట్టెలు, తాళి వంటి వస్తువులు ఉండటం విశేషం.

(ఇదీ చదవండి:  నటి అషురెడ్డిపై కేసు నమోదు.. పెళ్లి పేరుతో రూ. 9 కోట్లు మోసం)

సినీ నటి అషురెడ్డిపై హైదరాబాద్‌లో కేసు నమోదైనట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిందని హైదరాబాద్‌ షేక్‌పేట్‌కు చెందిన వై.వి.ధర్మేంద్ర ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో తన నుంచి  రూ.9.35 కోట్లు కాజేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. లండన్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా తాను పని చేస్తున్నానని చెప్పిన ధర్మేంద్ర..  2018లో భారత్‌కు వచ్చిన సమయంలో అషురెడ్డి పరిచయమైనట్లు పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement