నటి అషురెడ్డిపై కేసు నమోదు.. పెళ్లి పేరుతో రూ. 9 కోట్లు మోసం | Hyderabad Police Case File On Actress Ashu Reddy | Sakshi
Sakshi News home page

నటి అషురెడ్డిపై కేసు నమోదు.. పెళ్లి పేరుతో రూ. 9 కోట్లు మోసం

Apr 26 2026 9:38 AM | Updated on Apr 26 2026 10:59 AM

Hyderabad Police Case File On Actress Ashu Reddy

బిగ్‌బాస్‌ ఫేమ్‌, సినీనటి అషురెడ్డి(అశ్విని రెడ్డి)పై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిందని హైదరాబాద్‌ షేక్‌పేట్‌కు చెందిన వై.వి.ధర్మేంద్ర ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో తన నుంచి  రూ.9.35 కోట్లు కాజేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. లండన్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా తాను పని చేస్తున్నానని చెప్పిన ధర్మేంద్ర..  2018లో భారత్‌కు వచ్చిన సమయంలో అషురెడ్డి పరిచయమైనట్లు పేర్కొన్నారు.

పోలీసులతో ధర్మేంద్ర తండ్రి  సత్యనారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ' అమెరికాలో చదువు పూర్తి చేసి సినిమా ఛాన్స్‌లో కోసం హైదాబాద్‌ వచ్చినట్లు అషురెడ్డి చెప్పింది. మా అబ్బాయికి పరిచయం అయిన కొద్దిరోజుల్లోనే ప్రేమిస్తున్నాని చెప్పి పెళ్లి చేసుకుందామని నమ్మించింది. ఈ క్రమంలో మా అబ్బాయిని డబ్బులు అడగటం  మొదలు పెట్టింది. బంగారం, కారు పలు ఆస్తులను కొనుగోలు చేయించుకుని తన పేరుతోనే రిజిస్టర్‌ చేయించుకుంది. అయితే, కొద్దిరోజుల క్రితం ధర్మేంద్రను కలిశారు. అషురెడ్డితో పెళ్లి సంబంధాన్ని ఖాయం చేస్తున్నామని ముహూర్తం కోసం పూజారిని కూడా పిలిపించి హడావుడి చేశారు.  

కానీ, వెంటనే ముఖం చాటేసి పెళ్లికి నిరాకరించారు. గతేడాది వరకు నా కుమారుడితో ఆమె టచ్‌లోనే ఉంది. ఇప్పటి వరకు రూ.9.35 కోట్ల వరకు నగదు, సుమారు 5 కిలోల బంగారం, కారు, ఫ్లాట్‌  కొనుగోలు చేసి తన పేరుతో రాయించుకుంది. ఆమెతో పాటు తన సోదరి కూడా రూ. 50 లక్షలు తీసుకుని తిరిగి ఇవ్వలేదు.' అని ధర్మేంద్ర తండ్రి  సత్యనారాయణ పేర్కొన్నారు. దీంతో హైదరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

 


 

Advertisement
 
Advertisement
Advertisement