యాడ్‌కి, సినిమాకి ఒకే రెమ్యునరేషన్‌..సుహాస్‌ ఏమన్నారంటే..? | Actor Suhas Respond On His Remuneration Rumours | Sakshi
Sakshi News home page

యాడ్‌కి, సినిమాకి ఒకే రెమ్యునరేషన్‌..సుహాస్‌ ఏమన్నారంటే..?

Published Tue, Mar 25 2025 12:15 PM | Last Updated on Tue, Mar 25 2025 12:23 PM

Actor Suhas Respond On His Remuneration Rumours

సినిమా సినిమాకు డిఫరెంట్‌ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న హీరో సుహాస్‌. ఒకవైపు సహాయక నటుడి పాత్రలు పోషిస్తూనే.. మరోవైపు హీరోగాను రాణిస్తున్నాడు. జూనియర్‌ ఆర్టాస్ట్‌గా కేరీర్‌ ఆరంభించి..ఇప్పుడు హీరో స్థాయికి ఎదిగాడు. కెరీర్‌లో ఎదిగినట్లుగానే తన రెమ్యునరేషన్‌ని కూడా పెంచేశాడు. ప్రస్తుతం ఈ టాలెంటెడ్‌ యాక్టర్‌ ఒక్కో సినిమాకు రూ. 2.5 నుంచి రూ.3 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే రెమ్యునరేషన్‌ గురించి మీడియా అడిగిన ప్రతిసారి  హాస్యాస్పదంగా స్పందిస్తూ తప్పించుకుంటున్నాడు. అయినా కూడా మీడియా ప్రతినిధులు మాత్రం సుహాస్‌ రెమ్యునరేషన్‌ గురించి ప్రతి ప్రెస్‌మీట్‌లోనూ అడుగుతూనే ఉన్నారు. తాజాగా మరోసారి సుహాస్‌కు మీడియా నుంచి ఇదే ప్రశ్న ఎదురవ్వగా.. ‘ఏం టార్చర్ ఇది.. యాక్టింగ్ గురించి మానేసి నా రెమ్యూనరేషన్ గురించి ఎందుకు,’ అని కాస్త అసహనం వ్యక్తం చేశాడు.

సుహాస్‌ హీరోగా నటించిన  రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ 'ఓ భామ అయ్యో రామ'.తాజాగా ఈ మూవీ ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ‘యాడ్‌కి, సినిమాకే ఒకే రకమైన రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నారట కదా?’ అని ఓ రిపోర్టర్‌ ప్రశ్నించాడు. దానికి సుహాస్‌ సమాధానం చెబుతూ.. ‘ప్రతిసారి నా రెమ్యునరేషన్‌ గురించే అడుగున్నారు? ఏం టార్చర్ అయిపోయింది ఇది.. జీవితమో..(నవ్వుతూ..). మీరు అనుకున్నంత కాదు కాని మంచిగానే ఇచ్చారు. ఇదేంటో.. యాక్టింగ్‌ బాగా చేస్తాననేది వదిలేసి..రెమ్యునరేషన్‌ భారీగా తీసుకుంటున్నారనేదే ప్రచారం చేస్తున్నారు. అందులో వాస్తవం లేదు’అని సుహాస్‌ చెప్పుకొచ్చాడు. ఇక ప్రభాస్‌ స్పిరిట్‌ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడంటూ వస్తున్న వార్తలో నిజం లేదని, తనకు ఇప్పటివరకు ఆ మూవీ టీమ్‌ నుంచి కాల్‌ రాలేదని స్పష్టం చేశాడు.

ఇక ‘ఓ భామ అయ్యో రామ’ విషయానికొస్తే..  సుహాస్‌ నటిస్తున్న తొలి రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌. మలయాళంలో జో అనే చిత్రంతో అందరి హృదయాలను దోచుకున్న  నటి మాళవిక మనోజ్ (జో ఫేమ్) ఈ చిత్రంతో తెలుగులో  కథానాయికగా పరిచయమవుతోంది.  రామ్ గోధల దర్శకుడు. వీ ఆర్ట్స్‌ పతాకంపై హరీష్‌ నల్ల  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ కథానాయకుడు రానా దగ్గుబాటి  స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement