ఓటీటీ కోసం మరోసారి మెగాఫోన్‌ పట్టిన రేవతి | Actor Revathi Again Direct Web Series | Sakshi
Sakshi News home page

ఓటీటీ కోసం మరోసారి మెగాఫోన్‌ పట్టిన రేవతి

Oct 10 2024 11:59 AM | Updated on Oct 10 2024 12:52 PM

Actor Revathi Again Direct Web Series

సౌత్‌ ఇండియా సీనియర్‌ నటి రేవతిలో మరో టాలెంట్‌ కూడా దాగి ఉంది. ఇండస్ట్రీలో ఆమె దర్శకురాలిగా, సింగర్‌గా కూడా మెప్పించారు. తమిళం, తెలుగు, కన్నడం, హిందీ తదితర భాషల్లో నటించి పేరు గడించారు. కాగా మిత్ర్‌ మై ఫ్రెండ్‌ అనే ఆంగ్ల చిత్రం ద్వారా దర్శకురాలిగా మారిన రేవతి తొలి చిత్రానికే జాతీయ ఉత్తమ అవార్డును గెలుచుకున్నారు. ఆ తరువాత ఫిర్‌ మిలేంగే ముంబాయ్‌ కట్టింగ్‌ అనే హిందీ చిత్రాలకు, కేరాళా కేఫ్‌ పేరుతో మలయాళంలోనూ చిత్రాలు చేశారు. అదేవిధంగా సలామ్‌ వెంకీ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. 

అయితే, చిన్న గ్యాప్‌ తరువాత మరోసారి మోగాఫోన్‌ పట్టారీమె. ఈసారి నటి రేవతి వెబ్‌ సిరీస్‌కు దర్శకత్వం వహించడం విశేషం. దీని గురించి ఆమె సామాజిక మాద్యమాల్లో పేర్కొంటూ ఈనెల 5న తాను దర్శకత్వం వహిస్తున్న వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌ ప్రారంభం అయ్యిందని తెలిపారు. 

దీనికి సిద్ధార్ధ్‌ రామసామి సహాయ దర్శకుడిగా పని చేస్తున్నట్లు చెప్పారు. ఈ వెబ్‌ సిరీస్‌ను డిస్నీ ప్లస్‌ ఓటీటీ స్ట్రీమింగ్‌ చేయనుందని తెలిపారు. ఇందులో నటిస్తున్న నటీనటులు, పని చేస్తున్న సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు రేవతి పేర్కొన్నారు.


Advertisement
 
Advertisement
Advertisement