డార్లింగ్ ప్రభాస్ ఒక్క రోజు భోజనం ఖర్చు ఎంతో తెలుసా? | Actor Prabhas Favorite Food Varieties And Cost Details | Sakshi
Sakshi News home page

Prabhas: ఫుడ్ అంటే ప్రభాస్.. ప్రభాస్ అంటే ఫుడ్.. ఇది డార్లింగ్ రేంజ్!

Dec 26 2023 1:21 PM | Updated on Dec 26 2023 1:55 PM

Actor Prabhas Favorite Food Varieties And Cost Details - Sakshi

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పేరు చెప్పగానే చాలామందికి గుర్తొచ్చేది ఫుడ్. అవును మీరు కరెక్ట్‌గానే విన్నారు. ఆతిథ్యం విషయంలో తెలుగు హీరోల్లో మన డార్లింగ్‌ని కొట్టేవాళ్లు లేరు. ప్రభాస్‌తో పనిచేసిన చాలామంది హీరోయిన్లు, కో యాక్టర్స్.. ప్రభాస్ ఆతిథ్యానికి ఉబ్బితబ్బిబ్బైపోయారు. ఇవన్నీ అందరికీ తెలుసు కానీ ప్రభాస్.. ఫుడ్ కోసం ఒక్కరోజులో ఎంత ఖర్చు చేస్తాడో తెలుసా?

ప్రభాస్ మంచి భోజనప్రియుడు. ఈ విషయం అభిమానులకు చాలా బాగా తెలుసు. ప్రభాస్ ఇంట్లో లేదా షూటింగ్‌లో బోలెడన్ని వెరైటీ వెజ్-నాన్ వెజ్ వంటకాలు ఉండాల్సిందే. ఎందుకంటే మన డార్లింగ్ ఎప్పుడు ఏం తింటాడనేది తెలీదు. అలానే ప్రభాస్ ఎప్పుడూ ఒంటరిగా తినడు. 10-20 మందితో కచ్చితంగా కలిసి తినాల్సిందే. కొన్నికొన్నిసార్లు సెట్‌లో ఉన్నవాళ్లందరికీ కూడా ప్రభాస్ ఇంటి నుంచి భోజనాలు వస్తుంటాయి. 

(ఇదీ చదవండి: Bigg Boss Telugu: పల్లవి ప్రశాంత్ వివాదం.. నిర్వహకులు షాకింగ్ డెసిషన్)

ఇప్పటికే ప్రభాస్.. వంటల్లో వెరైటీలతో ఎలా మొహమాట పెట్టేశాడో.. రాజమౌళి దగ్గర నుంచి పూజాహెగ్డే, శ్రద్ధాదాస్, కృతిసనన్, కరీనా కపూర్ లాంటి హీరోయిన్లు.. 'సలార్'లో చేసిన పృథ్వీరాజ్ వరకు చాలామంది చెప్పారు. ఇన్ స్టాలోనూ ప్రభాస్ ఇచ్చిన ఫుడ్ ఫొటోల్ని కూడా పోస్ట్ చేశారు.

ఇలా ఫుడ్‌పై విపరీతమైన ప్రేమ ప్రభాస్ కోసం.. స్పెషల్‌గా ఓ కుకింగ్ టీమే ఉందట. వీళ్లు ఓ రోజులో ప్రిపేర్ చేసి ఫుడ్ విలువ దాదాపు రూ.2 లక్షల వరకు ఉంటుందని టాక్. ఎంత రూమర్ అయినా సరే ఇది ఆల్మోస్ట్ నిజమే కావొచ్చు. ఎందుకంటే చేపలు, చికెన్, మటన్, రొయ్యలు.. ఇలా ఇన్నిన్ని రకాల వంటలు చేస్తే ఆ మాత్రం ఖర్చు ఉంటుందిలే!

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'మంగళవారం' సినిమా.. స్ట్రీమింగ్ అందులోనే)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement