
బుల్లితెర షో ద్వారా కమెడియన్‌గా ప్రేక్షకులకు పరిచయమయ్యాడు మహేశ్ ఆచంట (Mahesh Achanta). జబర్దస్త్ కామెడీతో సినిమాల్లోనూ అవకాశాలు అందుకున్నాడు. శతమానం భవతి చిత్రంతో క్లిక్ అయ్యాడు. రంగస్థలం సినిమాతో టాప్ ఆర్టిస్ట్‌గా మారిపోయాడు. ఈ సినిమా తర్వాత అతడు వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అప్పటినుంచి రంగస్థలం మహేశ్‌గా స్థిరపడిపోయాడు.
సినిమా
మహానటి, యాత్ర, మహర్షి, గుణ 369, గుంటూరుకారం, జాతిరత్నాలు, విరూపాక్ష, సీతారామం, తండేల్.. ఇలా అనేక సినిమాలు చేశాడు. సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని సెటిలయ్యాడు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మహేశ్.. బంధువులమ్మాయి పావనిని వివాహమాడాడు. 2020లో లాక్‌డౌన్‌లోనే వీరి పెళ్లి జరిగింది. ఈ దంపతులకు ఓ కూతురు సంతానం.

గుడ్‌న్యూస్
తాజాగా మహేశ్ ఆచంట ఓ గుడ్‌న్యూస్ చెప్పాడు. రెండోసారి తండ్రి కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. భార్య మెటర్నటీ ఫోటోషూట్‌లో దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నాడు. ఇది చూసిన తారలు, అభిమానులు మహేశ్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
చదవండి: బాలీవుడ్‌లో నన్ను గ్లామర్ డాల్‌గానే చూస్తున్నారు: పూజా హెగ్డే