కోలీవుడ్ నటి ఖుష్బు సుందర్ కుమార్తె అవంతిక పెళ్లి ఇటీవలే గ్రాండ్‌గా జరిగింది. గోవాలో జరిగిన ఈ పెళ్లి వేడుకలో టాలీవుడ్ సినీతారలు సందడి చేశారు. చిరంజీవితో పాటు వెంకటేశ్, నాగార్జున, త్రిష, తమన్నా, రాధికా , సుహాసిని, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్ ఈ పెళ్లికి హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అయితే తాజాగా ఈ పెళ్లికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. తన కూతురి మెడలో వరుడు తాళి కడుతున్న సమయంలో ఖుష్బు సుందర్ ఫుల్ ఎమోషనల్‌గా కనిపించింది. ఈ వీడియోలో ఆమె తీవ్ర భావోద్వేగానికి గురై ఏడ్చేసింది. వారి చిన్న కుమార్తె ఆనందిత కూడా అక్క పెళ్లిని చూసి ఎమోషనలైంది. ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా.. ఖుష్బు- సుందర్‌ల పెద్ద కూతురు అవంతిక సుందర్.. శ్రవణ్ శ్రీనివాసన్‌ను వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి వేడుక జూన్ 25న గ్రాండ్‌గా జరిగింది.


