మెగాస్టార్ చిరంజీవి రాఖీ సెలబ్రేషన్స్ | Actor Chiranjeevi Rakhi Celebrations Video | Sakshi
Sakshi News home page

Chiranjeevi Rakhi Video: చిరుకి రాఖీ కట్టిన సిస్టర్స్.. వీడియో పోస్ట్

Aug 31 2023 3:32 PM | Updated on Aug 31 2023 3:43 PM

Actor Chiranjeevi Rakhi Celebrations Video  - Sakshi

ఈ మధ్యే కాలికి చిన్నపాటి సర్జరీ చేయించుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. మొన్న పుట్టినరోజున కూడా ఎక్కడా కనిపించలేదు. అలాంటిది తాజాగా రాఖీ సందర్భంగా తన చెల్లెళ్లతో కలిసి పండగని సెలబ్రేట్ చేసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోని తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.

(ఇదీ చదవండి: 'జైలర్' విలన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు)

ఈ వీడియోలో భాగంగా చిరంజీవి కుర్చీలో ఉండగా, ఇద్దరు చెల్లెళ్లు ఆయనకు రాఖీ కట్టి, ఆశీర్వాదం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి. అయితే మెగాస్టార్ కాబట్టి.. చెల్లెళ్లు ఇద్దరికీ రాఖీ కట్టిన తర్వాత గిఫ్ట్స్ లేదా డబ్బులు బాగానే ఇచ్చి ఉండొచ్చని తెలుస్తోంది.

'భోళా శంకర్' సినిమాతో ఈ మధ్యే వచ్చిన చిరు.. బాక్సాఫీస్ దగ్గర ఘోరమైన డిజాస్టర్ అందుకున్నారు. పుట్టినరోజు సందర్భంగా రెండు కొత్త చిత్రాలు ప్రకటించారు. వీటిలో కూతురు సుస్మిత నిర్మాణంలో ఒకటి, యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో వశిష్ట్ దర్శకుడిగా మరో సినిమా చేయబోతున్నారు. త్వరలో ఈ రెండు సెట్స్‌పైకి వెళ్లనున్నాయి.

(ఇదీ చదవండి: హీరోయిన్‌తో ఐఆర్ఎస్‌ అధికారి రిలేషన్‌.. గిఫ్ట్‌గా బంగారం, భవనాలు)

Advertisement
 
Advertisement
Advertisement