Sakshi News home page

Navya Nair Questioned By ED: హీరోయిన్‌తో ఐఆర్ఎస్‌ అధికారి రిలేషన్‌.. గిఫ్ట్‌గా బంగారం, భవనాలు.. సీబీఐకి ఎలా దొరికిపోయారంటే

Published Thu, Aug 31 2023 12:28 PM

Actress Navya Nair Received Gifts From IRS Officer Sachin Sawant - Sakshi

మనీలాండరింగ్ కేసులో మలయాళ ప్రముఖ నటి నవ్య నాయర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది. మనీలాండరింగ్ కేసులో ఇప్పటికే అరెస్ట్‌ అయిన ఐఆర్‌ఎస్ అధికారి సచిన్ సావంత్‌తో నవ్య నాయర్‌కు సన్నిహిత స్నేహం ఉందని ఈడీ గుర్తించింది. ఈ కేసులో నవ్య నాయర్‌ను ముంబయికి పిలిపించి ఈడీ ప్రశ్నించి వాంగ్మూలాన్ని నమోదు చేసింది. 

(ఇదీ చదవండి:  హీరోయిన్‌ అవుతానని ఊహించలేదు..ఆ చిత్రం నాకు చాలా స్పెషల్‌: ఆనంది)

సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా సచిన్ సావంత్ మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఆదారాలు ఉన్నాయి. ఈ కేసు దర్యాప్తు సందర్భంగా అతని  మొబైల్ డేటాను అధికారులు పరిశీలించారు. అందులో వాట్సప్‌ ద్వారా ఆయన చేసిన చాటింగ్స్‌ స్టేట్‌మెంట్‌లను వారు సేకరించారు. దీనిలో భాగంగానే  ఆయనతో నవ్య నాయర్‌కు మంచి పరిచియమే ఉందని ఈడీ గుర్తించింది. వాటి అధారంగా ఐఆర్‌ఎస్‌ అధికారి సచిన్‌ సావంత్‌, నవ్య నాయర్‌ చాలా సన్నిహితంగా మెలిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.

నటి నవ్య నాయర్‌ని కలిసేందుకు సచిన్‌ సావంత్ సుమారు 10 సార్లు పైగానే కొచ్చిన్‌కు కూడా వెళ్లినట్లు సమాచారం. ఇదే విషయాన్ని ఈడీ ప్రశ్నిస్తే... తనకు సచిన్ సావంత్‌తో ఎలాంటి సంబంధం లేదని ఆమె తెలిపింది. తామిద్దరం కేవలం స్నేహితులమనే తెలిపింది. కానీ నవ్య నాయర్‌కు సచిన్ సావంత్ నగలతోపాటు కొన్ని బహుమతులు ఇచ్చాడని పక్కా ఆధారాలతో విచారణలో తేలింది. దీనికి సమాధానంగా  సచిన్ తమ స్నేహానికి గుర్తుగా కొన్ని నగలను బహుమతిగా ఇచ్చాడని నవ్య నాయర్‌ తెలిపింది. ఆమె వాంగ్మూలాన్ని ప్రత్యేక కోర్టుకు సమర్పించిన చార్జిషీట్‌లో ఈడీ జత చేసింది. 

ఎవరీ సచిన్‌ సావంత్
సచిన్‌ సావంత్ గతంలో ముంబైలోని జోనల్ కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్‌గా (ED)  నియమించబడ్డారు . సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అతన్ని అవినీతి, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సచిన్‌ సావంత్ పేరును చేర్చింది. ప్రస్తుతం కస్టమ్స్,  జీఎస్‌టీ అదనపు కమిషనర్‌గా ఆయన పనిచేస్తున్నాడు. అతను భారీగా మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఆధారలు లభించడంతో సీబీఐ ఎంట్రీ ఇచ్చి అతన్ని విచారిస్తుంది. ఈ విచారణలో కోట్ల ఆస్తులను కూడబెట్టినట్లు సమాచారం. తన కుటుంబ సభ్యులు, సన్నీహితుల పేర్లతో పెద్ద పెద్ద భవనాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసు విచారణలో భాగంగానే మలయాళ నటి నవ్య నాయర్‌ పేరు తెరపైకి వచ్చింది.

Advertisement

What’s your opinion

Advertisement