నాలుగేళ్లకోసారి పుట్టినరోజు జరుపుకుంటున్న హీరో | Sakshi
Sakshi News home page

నాలుగేళ్ల తర్వాత పుట్టినరోజు జరుపుకుంటున్న హీరో

Published Thu, Feb 29 2024 9:44 PM

This Actor Birthday Celebrate On February 29th - Sakshi

కొత్తదనం పంచడంలోనూ.. కొత్త దర్శకుల్ని ప్రోత్సహించడంలోనూ ఎప్పుడూ ముందుంటారు హీరో శ్రీవిష్ణు . రొటీన్ సినిమాలకు భిన్నంగా త‌న‌కంటూ డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ  ఆయన హిట్‌ కొట్టి అభిమానులను సంపాధించుకున్నాడు. గతేడాదిలో 'సామజవరగమన'తో హిట్‌ క్టొటిన ఆయన నేడు ఫిబ్రవరి 29న 40వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ ఏడాది లీప్‌ ఇయర్‌ కాబట్టి ఫిబ్రవరిలో 29 రోజులు ఉంటాయి. నాలుగేళ్లకు ఒకసారి ఇలాంటి సందర్భం వస్తుంది. అందుకే ఈ తేదీలో పుట్టినవారు నాలుగేళ్లకు ఒక్కసారి తమ పుట్టినరోజు వేడుకల్ని జరుపుకుంటారు. 

నేడు హీరో శ్రీవిష్ణు కూడా తన పుట్టినరోజును జరుపుకున్నారు. నాలుగేళ్లకు ఒక్కసారి ఈ వేడుకలు జరుగుతుండటంతో ఎంతో ఘనంగా తన అభిమానులతో పాటు ఆయన జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సినిమా విషయాలను షేర్ చేస్తున్నారు మేకర్స్. ఆయన నటించిన 'ఓం భీమ్ బుష్' సినిమా మార్చి 22న విడుదల కానుంది. స్వాగ్, ఏమండో బాగున్నారా సినిమాల్లో నటిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement