బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ తనయుడు, హీరో అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) భావోద్వేగానికి లోనయ్యాడు. తన దగ్గర 27 ఏళ్లుగా పని చేస్తున్న మేకప్ ఆర్టిస్టు అశోక్ చనిపోయాడంటూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. అతడితో కలిసి దిగిన ఫోటోను సైతం జత చేశాడు. 'అశోక్ దాదా.. నా దగ్గర 27 ఏళ్లుగా పని చేస్తున్నాడు. నా ఫస్ట్ సినిమా నుంచి అతడే నాకు మేకప్ వేస్తున్నాడు. అతడు కేవలం నా టీమ్‌లో ఒక వ్యక్తి మాత్రమే కాదు, నా కుటుంబసభ్యుడు కూడా!
ఆయన లేకుండా షూటింగ్‌కు వెళ్లలేదు
అతడి అన్న దీపక్.. మా నాన్న దగ్గర దాదాపు 50 ఏళ్లుగా మేకప్‌మ్యాన్‌గా పనిచేస్తున్నాడు. కొన్నేళ్లుగా తన ఆరోగ్యం బాగుండటం లేదు. దానివల్ల కొన్నిసార్లు నాతోపాటు సెట్‌కు రావడం లేదు. కానీ నాకు మంచిగా మేకప్ వేయమని తన అసిస్టెంట్‌కు మరీమరీ చెప్పేవాడు. అంతకుముందు వరకు ఆయన లేకుండా నేను షూటింగ్‌కు వెళ్లిందే లేదు. చాలా మంచి వ్యక్తి. ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించేవాడు. కనిపించిన వెంటనే ఆలింగనం చేసుకునేవాడు. బ్యాగ్‌లో తినడానికి ఏదో ఒకటి తెచ్చుకునేవాడు.
ఆయన పాదాలకు నమస్కరించాకే..
నేను ఏదైనా సినిమా ఒప్పుకున్నప్పుడు మొదట ఈయన కాళ్లకు నమస్కరించిన తర్వాతే కెమెరా ముందుకు వెళ్తాను. అలా ప్రతి సినిమాకు ఆయన ఆశీర్వాదం తీసుకుంటాను. ఇప్పటినుంచి తన కోసం ఆకాశంవైపు చూస్తాను.. స్వర్గంలో ఉన్న ఆయన నన్ను కచ్చితంగా దీవిస్తాడు. నీ ప్రేమాభిమానాలకు, కేరింగ్‌కు, టాలెంట్‌కు.. అన్నింటికీ థాంక్యూ దాదా. నువ్వు నాతో లేవంటే నమ్మబుద్ధి కావడం లేదు. ఇకపై నువ్వు లేకుండానే సెట్‌కు వెళ్లాలని తల్చుకుంటేనే మనసు ముక్కలవుతోంది. నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా..' అంటూ అభిషేక్ బచ్చన్ భావోద్వేగానికి లోనయ్యాడు.
చదవండి: మరణాన్ని ముందే ఊహించిన హీరో..


