ఎన్టీఆర్ బావమరిది రెండో సినిమా.. ట్రైలర్ ఎలా ఉందంటే? | Aay Movie Trailer Telugu Review | Sakshi
Sakshi News home page

Aay Trailer: ఆగస్టు 15 రేసులో చిన్న సినిమా.. ట్రైలర్ రిలీజ్

Aug 5 2024 1:40 PM | Updated on Aug 5 2024 1:40 PM

Aay Movie Trailer Telugu Review

జూ.ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్.. 'మ్యాడ్' సినిమాతో నటుడిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. ఓ మాదిరి యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇతడి రెండో సినిమా 'ఆయ్'. గోదావరి జిల్లాలోని ఓ పల్లెటూరి బ్యాక్ డ్రాప్‌తో తీశారు. ఆగస్టు 15న భారీ చిత్రాలతో థియేటర్లలో రిలీజ్ అవుతోంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇంతకీ ట్రైలర్ ఎలా ఉందంటే?

(ఇదీ చదవండి: ప్రభాస్ ఫుడ్‌కి ఫిదా అయిన ఆరో హీరోయిన్.. ఏం చెప్పిందంటే?)

'ఆయ్' ట్రైలర్ చూస్తే.. విలేజీలో ముగ్గురు కుర్రాళ్లు. అందులో హీరో ఒకడు. ఒకమ్మాయితో ప్రేమ, తర్వాత జరిగిన పర్యవసనాలేంటి? అనేది స్టోరీ లైన్ అనిపిస్తోంది. అయితే ఫుల్ ఆన్ కామెడీగా సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. ట్రైలర్‌లోనూ డబుల్ మీనింగ్ లాంటి డైలాగ్స్ ఉన్నాయి. అంటే సినిమాలోనూ ఇలాంటివి ఉండొచ్చు. ట్రైలర్ అయితే ఫన్నీగా బాగానే ఉంది. 

కాకపోతే 'మిస్టర్ బచ్చన్', 'డబుల్ ఇస్మార్ట్', 'తంగలాన్' సినిమాలతో పోటీని తట్టుకుని ఎంత మేరకు థియేటర్లలో నిలబడుతుందనేద పెద్ద టాస్క్. నిర్మించింది గీతా ఆర్ట్స్ కాబట్టి థియేటర్ల పరంగా ఢోకా ఉండకపోవచ్చు. కానీ 'ఆయ్'కి హిట్ టాక్ కూడా ముఖ్యమే. ఒకవేళ మిగతా సినిమాలకు హిట్ టాక్ వస్తే మాత్రం 'ఆయ్' పరిస్థితి ఏంటనేది ఇక్కడ ప్రశ్న. తొలి సినిమా 'మ్యాడ్'తో హిట్ కొట్టిన తారక్ బావమరిది.. రెండో సినిమాతో ఏం చేస్తాడో చూడాలి?

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీలో 21 సినిమాలు/ సిరీస్‌లు రిలీజ్‌)

Advertisement
 
Advertisement
Advertisement