ఆట సందీప్‌ను కొట్టిన పల్లవి ప్రశాంత్‌ .. ఎమోషనల్‌ అయిన జ్యోతిరాజ్‌ | Sakshi
Sakshi News home page

ఆట సందీప్‌ను కొట్టిన పల్లవి ప్రశాంత్‌ అంటూ కామెంట్లు.. ఎమోషనల్‌ అయిన జ్యోతిరాజ్‌

Published Tue, Oct 10 2023 8:42 AM

Aata Sandeep Wife Jyothi Raj Emotional Words On Youtubers - Sakshi

టాలీవుడ్‌లో ప్రముఖ కొరియోగ్రాఫర్‌ ఆట సందీప్‌ పేరు తెలియనివారు ఉండరు. కొరియోగ్రాఫర్‌, డ్యాన్సర్‌గా ఈయన చాలామందికి సుపరిచితం. బిగ్‌బాస్‌ సీజన్‌-7లో ఆయన టాప్‌ కంటెస్టెంట్‌గా కొనసాగుతున్నారు.  ప్రముఖ డ్యాన్స్‌ రియాలిటీ షో 'ఆట' ఫస్ట్‌ సీజన్‌లో విజేతగా నిలిచి ఫేమ్ సంపాదించాడు. అప్పటినుంచి ఈయన పేరు ఆట సందీప్‌గా స్థిరపడిపోయింది. ఆయన భార్య జ్యోతిరాజ్‌ కూడా మంచి డ్యాన్సరే అని తెలిసిందే. వారిద్దరూ డ్యాన్స్‌ బరిలో దిగితే గెలుపు ఖాయం అని తెలిసిందే.

(ఇదీ చదవండి; గుండెపోటుతో బాడీ బిల్డర్ మృతి.. పెళ్లి తర్వాత ఈ పొరపాటు చేయడంతో)

తాజాగా బిగ్‌బాస్‌లో ఉన్న సందీప్‌పై పలువురు ట్రోల్ చేస్తున్నారు. ఈ విషయంపై ఆయన భార్య జ్యోతిరాజ్‌ స్పందించారు. జీవితంలో సందీప్‌ ఎంతో కష్టపడి పైకి వచ్చాడు.. ఆయనొక కళాకారుడిగా గుర్తింపు ఉంది. ఎవరి సపోర్ట్‌ లేకుండా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు. అలాంటి వ్యక్తిపై కొందరు యూట్యూబర్స్‌ చీప్‌ థంబ్‌నైల్స్‌ పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని జ్యోతిరాజ్‌ ఆవేదన చెందారు. అందరిలాగే అతనికి కూడా ఫ్యామిలీ ఉందని మరిచిపోవద్దని తెలిపారు. అలాంటి వాటి వల్ల తామెంతో బాధపడుతున్నట్లు ఆమె పేర్కొన్నారు.

'యూట్యూబ్‌ ద్వారా వచ్చే డబ్బు, వ్యూస్‌ కోసం ఒక మనిషిని ఎంత నీచంగా అయినా మాట్లాడుతారా.. అలాంటి తప్పుడు వీడియోలతో వచ్చిన డబ్బుతో ఎప్పటికీ బాగుపడరు. అన్యాయంగా ఒకరిని తొక్కుతూ.. మరోకడు పైకి రావాలని ఆకాంక్ష ఎందుకు..? బిగ్‌బాస్‌లో గెలిచేవాడు గెలుస్తాడు. ఆట నుంచి బయటకు వచ్చేవాడు వస్తాడు. అంతేగానీ ఈ చీప్‌ ట్రిక్స్‌ ఎందుకు..? అందరిలాగే ఆట సందీప్‌ కూడా బిగ్‌బాస్‌తో మంచిపేరు రావాలి.. ప్రజల్లో మరింత గుర్తింపు దక్కాలనే వెళ్లాడు.

కానీ ఒకరిని గెలిపించేందుకు బయట కొందరు చేసే దందా ఎంతవరకు కరెక్ట్‌..? వారు కోరుకున్న వ్యక్తి గెలవాలని ఎదుటివారిపై నీచమైన కామెంట్లు చేస్తున్నారు. అలాంటి వారిలో కొందరు సందీప్‌పై చేస్తున్న కామెంట్ల వల్ల నాతో పాటు మా కుంటుంబం ఎంతో బాధపడుతుంది.' అని ఆమె భావోద్వేగానికి గురైయారు.

ఆట సందీప్‌ను కొట్టిన పల్లవి ప్రశాంత్‌
'ఆట సందీప్‌ను కొట్టిన పల్లవి ప్రశాంత్‌' అని పలువురు తప్పుడు థంబ్‌నైల్స్‌ పెట్టి వీడియో చేశారు. మరికొందరు అదే స్థాయిలో చెడు కామెంట్లు కూడా చేస్తున్నారని జ్యోతిరాజ్‌ ఇలా తెలిపారు. 'అసలు పల్లవి ప్రశాంత్‌ కుక్కకొట్టుడు కొట్టడం ఏంటి..? ఎవరు పల్లవి ప్రశాంత్‌..? ఎవరు ఆట సందీప్‌..? అదీ డబ్బుతో వచ్చే విలువ కాదు. కళతో వచ్చే విలువ. ఎంతో కష్టపడి సందీప్‌ ఈ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. పల్లవి ప్రశాంత్‌ తమ్ముడికి అందరూ సపోర్ట్‌ చేయండి.. నేనూ కూడా చేస్తాను.. తప్పులేదు. 

ఎందుకంటే ఒక రైతు బిడ్డగా అందరం గుర్తించాలి. ఎంతో కష్టపడి అతను కూడా ఈ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఇలాంటి థంబ్‌నైల్స్‌ పెట్టడంతో పాటు ఒక మనిషిని మరోక వ్యక్తితో పోల్చి డీగ్రేడ్‌ చేయకండి. ఇదీ చాలా తప్పు. అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్న. బిగ్‌బాస్‌లోని అమ్మాయిల్ని కూడా కొందరు నోటికి వచ్చినట్లు కామెంట్లు చేస్తున్నారు.

వారందరూ కూడా తమ కుటుంబాన్ని వదిలేసి అక్కడ ఉన్నారు. అలాంటి వారి గురించి తప్పుగా మాట్లాడటం కరెక్ట్‌ కాదు. ఆట సందీప్‌ అంటే ఒక అబ్బాయి కాబట్టి సరేలే అనుకోవచ్చు కానీ ఒక అమ్మాయిని నీచంగా తిట్టడం వల్ల ఆమె కెరియర్‌ పరిస్థితి ఏంటి. దయచేసి బిగ్‌బాస్‌లోని ఆడపిల్లల గురించి చెడు కామెంట్లు చేయకండి.' అని జ్యోతిరాజ్‌ ఎమోషనల్‌ అయ్యారు.

Advertisement
 
Advertisement
 
Advertisement