ఆట సందీప్ పేరు ఇప్పుడు టాలీవుడ్‌లో మారుమోగిపోతుంది. మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాలో చిరంజీవితో ఆయన వేయించిన ‘హుక్’ స్టెప్పులు మెగా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. దీంతో పాటు ఆయన కొరియోగ్రఫీ అందించిన ‘గిర గిర గింగిరానివే..(చాంపియన్)’ సాంగ్ కూడా సోషల్ మీడియాను షేక్ చేసింది. ఇలా సందీప్ కొరియోగ్రఫీ చేసిన రెండు పాటలు వరుసగా సూపర్ హిట్ అవ్వడంతో..ఇప్పుడు ఆయన గురించి ఇండస్ట్రీ అంతా మాట్లాడుకుంటుంది. సోషల్ మీడియాలో కూడా సందీప్ గురించి చర్చిస్తున్నారు. గతంలో సందీప్ ఇచ్చిన ఇంటర్వ్యూలకు సంబంధించిన వీడియో క్లిప్పింగులను షేర్ చేస్తూ..ఆయనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇదిలా ఉంటే..తాజాగా సందీప్‌కి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. రెండేళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో సందీప్ మాట్లాడుతూ.. డబ్బులు ఇస్తాం.. తమతో గడపమని పలువురు మహిళలు తనను అడిగినట్లు చెప్పాడు. ఆ ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ గురించి చర్చకు వచ్చినప్పుడు సందీప్ తనకు ఎదురైన అనుభవాన్ని షేర్ చేసుకున్నాడు.
‘నాకు కూడా డబ్బులు ఇస్తాం.. వస్తావా అని కొంతమంది మహిళలు ఆఫర్ చేశారు. కొన్నాళ్ల క్రితం అమెరికా నుంచి వచ్చిన ఓ మహిళ.. ఒక వారం ఎంజాయ్ చేయాలి, డబ్బు ఇస్తా.. తనతో గడపమని ఆఫర్ చేసింది. ఈ మెసేజ్ చాలా పద్ధతిగా, కార్పొరేట్ స్టైల్‌లో మీకు ఇష్టం ఉందా? అన్నట్లుగా పెట్టారు. ఆమె ఎవరో ఏంటో నాకు తెలియదు. వెంటనే నాకు ఆసక్తి లేదని రిప్లై ఇచ్చాను. రెండు రోజుల తర్వాత మళ్లీ అదే పర్సన్ నుంచి ‘డబ్బులు ఎక్కువ కావాలంటే ఇచ్చేస్తా’ అని మెసేజ్ వచ్చింది. దీంతో నేను వెంటనే నా నెంబర్‌ని బ్లాక్ చేశా. పబ్లిక్‌లో ఉన్నప్పుడు గుడ్ వేలో ఉండాలని అనుకున్నాను.
అందుకే అలాంటి పనులు చేయదల్చుకోలేదు. అలా 4-5 సార్లు వేరు వేరు అమ్మాయిలు మేసేజ్ చేశారు. ఒకసారి ఓ ట్రాన్స్ జెండర్ కూడా అలా అడిగారు. ఒక బ్యూటిఫుల్ మెసేజ్ పెట్టి.. చివరల్లో నీతో గడపాలని ఉంది’ అని చెప్పారు. నేను సున్నితంగా తిరస్కరించా. వీళ్లంతా నా అందం చూసి కాదు కానీ.. నా డ్యాన్స్ నచ్చి అలా మెసేజ్ చేశారని భావిస్తున్నా’ అని సందీప్ చెప్పుకొచ్చాడు. రెండేళ్ల క్రితం ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో సందీప్ పక్కన అతని భార్య జ్యోతి కూడా ఉంది. మన శంకరవరప్రసాద్‌గారు రిలీజ్ తర్వాత ఇప్పుడు మరోసారి ఆ ఇంటర్వ్యూలో సందీప్ చెప్పిన విషయాలు చర్చనీయాంశంగా మారాయి.


