90 ఏళ్ల వయసులో సినిమాలో ఎంట్రీ ఇస్తున్న స్టార్‌ హీరో తల్లి! | Aamir Khan Mother Zeenat Khan Debut with Sitaare Zameen Par | Sakshi
Sakshi News home page

90 ఏళ్ల వయసులో తల్లి వెండితెర అరంగేట్రం.. తనకే ఆశ్చర్యంగా ఉందన్న స్టార్‌ హీరో

Jun 7 2025 2:59 PM | Updated on Jun 7 2025 4:27 PM

Aamir Khan Mother Zeenat Khan Debut with Sitaare Zameen Par

90 ఏళ్ల వయసులో ఎవరైనా ఏం చేస్తారు? హాయిగా విశ్రాంతి తీసుకుంటారు. కానీ ఈ స్టార్‌ హీరో తల్లి మాత్రం వృద్ధాప్యంలో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. బాలీవుడ్‌ స్టార్‌ ఆమిర్‌ ఖాన్‌ (Aamir Khan) తల్లి జీనత్‌ ఖాన్‌ (Zeenat Khan) ఓ సూపర్‌ హిట్‌ సినిమా సీక్వెల్‌లో నటించేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని ఆమిర్‌ స్వయంగా వెల్లడించాడు. 

బ్లాక్‌బస్టర్‌ సినిమా సీక్వెల్‌లో..
'2007లో వచ్చిన తారే జమీన్‌ పర్‌ ఎంత పెద్ద హిట్టయిందో అందరికీ తెలిసిందే! దానికి సీక్వెల్‌గా సితారే జమీన్‌ పర్‌ (Sitaare Zameen Par Movie) రాబోతోంది. ఈ మూవీలో అమ్మ ఓ చిన్న పాత్రలో కనిపించనుంది. నిజానికి తనకు సినిమాలంటే పెద్దగా ఇష్టముండదు. నాతో సెట్స్‌కు ఎప్పుడూ వచ్చేది కాదు. కానీ, సడన్‌గా ఓ రోజు నా మూవీ షూటింగ్‌ ఏ ప్రదేశంలో జరుగుతోంది? అని ఆరా తీసింది. అది విని నేను ఆశ్చర్యపోయాను. తనకు సెట్‌కు రావాలనుందని చెప్పింది.

మొట్టమొదటిసారి కెమెరాముందుకు..
దాంతో నా సోదరి అమ్మను వీల్‌చైర్‌లో నేనున్న లొకేషన్‌కు తీసుకొచ్చింది. ఆ రోజు పెళ్లి సెలబ్రేషన్స్‌పై పాట షూట్‌ చేస్తున్నాం. దర్శకుడు ఆర్‌ఎస్‌ ‍ప్రసన్నకు అప్పుడే ఓ అద్భుతమైన ఐడియా తట్టింది. మీ అమ్మను కూడా పాటలో కనిపించేలా చేస్తే ఎలా ఉంటుంది? అని అడిగాడు. కానీ, తను ఒప్పుకుంటుందా? అని ఆలోచించాను. ఏదైతే అది అయిందని అమ్మను అడిగితే ఆమె వెంటనే ఓకే చెప్పి నాకే సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. 

ఫ్యామిలీతో కలిసి..
కొన్ని షాట్స్‌లో ఆమె కనిపిస్తుంది. తను నటించిన ఏకైక సినిమా ఇదే కావడంతో ఈ మూవీ నాకెప్పుడూ ఓ అద్భుత జ్ఞాపకంగా మిగిలిపోనుంది. నా సోదరి కూడా తొలిసారి నాతో కలిసి నటించింది. భవిష్యత్తులో కూడా తనతో మరోసారి కలిసి యాక్ట్‌ చేస్తానేమో.. అని ఆమిర్‌ చెప్పుకొచ్చాడు. సితారే జమీన్‌ పర్‌ సినిమాలో అరోష్‌ దత్త, గోపీ కృష్ణ వర్మ, వేదాంత్‌ శర్మ, రిషబ్‌ జైన్‌, ఆశిష్‌ పెండ్సే.. తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ జూన్‌ 20న విడుదల కానుంది.

చదవండి: నన్ను దూరం పెట్టాడు.. ఎందుకు వదిలేస్తున్నావని నిలదీశా!

Advertisement
 
Advertisement
Advertisement