
మదన్ నాలుగు రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యాడు. దీంతో అతడిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి
"ఆ నలుగురు" చిత్రంతో రచయితగా తన ప్రతిభను నిరూపించుకున్న దర్శకుడు మదన్ అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారు. "పెళ్లయిన కొత్తలో" చిత్రంతో దర్శకుడిగా మారిన ఆయన నాలుగు రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యారు. దీంతో ఆయనను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా మదన్ స్వస్థలం మదనపల్లి. సినిమాల మీద ఆసక్తితో ఎస్.గోపాల్‌రెడ్డి దగ్గర అసిస్టెంట్ కెమెరామన్‌గా చేరారు. అలా మనసంతా నువ్వే సినిమాకు పని చేశారు. పెళ్లైన కొత్తలో మూవీతో దర్శకుడిగా మారారు. గుండె ఝల్లుమంది, ప్రవరాఖ్యుడు, కాఫీ విత్ మై వైఫ్, గరం, గాయత్రి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.
చదవండి: మరో విషాదం, నటి మృతి