
‘భలే మంచిరోజు’ (2015) చిత్రంతో 70ఎంఎం ఎంటర్‌టైన్ మెంట్స్ సంస్థ ఆరంభించి, తొలి చిత్రంతోనే అభిరుచి గల నిర్మాతలు అనిపించుకున్నారు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి. ఆ తర్వాత ‘ఆనందో బ్రహ్మ’ (2017), ‘యాత్ర’ (2019), ‘శ్రీదేవి సోడా సెంటర్’ (2021) వంటి చిత్రాలను నిర్మించారు. ఇప్పుడు ఒకేసారి ఆరు చిత్రాలకు శ్రీకారం చుట్టారు.
ఆదివారం సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి మాట్లాడుతూ – ‘‘మేం ఎప్పుడూ క్వాలిటీ కంటెంట్‌కే ప్రాధాన్యం ఇస్తాం. ఈ ఆరు సినిమాలకూ అదే ఫాలో అవుతున్నాం. వేరువేరు జానర్స్‌లో ఈ సినిమాలు ఉంటాయి. వచ్చే రెండేళ్లలో ఈ ఆరు సినిమాలను వరుసగా రూపొందించి, విడుదల చేస్తాం. ఇతర వివరాలు త్వరలో ప్రకటిస్తాం’’ అని పేర్కొన్నారు.