పెద్దశంకరంపేట(మెదక్): పేదలకు ఇందిరమ్మ ఇళ్లు వరమని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని కోళాపల్లిలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశంలో పాల్గొని మాట్లాడారు. పేదల సొంతింటి కలను నిజం చేయాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్‌రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారన్నారు. అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తున్నామన్నారు. అలాగే ఖేడ్ మున్సిపల్ చైర్మన్ నగేశ్ షెట్కార్ ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో నాయకులు నారాగౌడ్, సంగమేశ్వర్, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు పెరుమాండ్లుగౌడ్, సర్పంచ్‌లు రోమాల సాయిలు, శ్రీనివాస్, నాయకులు గోవింద్‌రావు, కుంట్ల రాములు, సత్యం, నర్సింలు, గంగారెడ్డి, భానుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
పాపన్నపేట(మెదక్): ఆరుతడి పంటల వేయాలనుకునే రైతులకు సబ్సిడీపై విత్తనాలు పంపిణీ చేస్తామని మండల వ్యవసాయాధికారి శ్రీనివాస్ రాజు తెలిపారు. జొన్న, మొక్కజొన్న, కుసుమ, నువ్వులు, మినుములు, అలసందలు, పల్లీలు, కూరగాయలు వేసుకోవాలనుకునే వారు సోమవారం సాయంత్రంలోగా వివరాలు అందజేయాలని కోరారు. సోలార్ కంచెలు, డ్రిప్, స్ప్రింక్లర్లు కావాలనుకునే వారు కూడా వివరాలు ఇవ్వాలని సూచించారు.
గజ్వేల్: ప్రభుత్వంపై పోరాటం చేయాల్సి తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీపై విమర్శలు చేయడమే లక్ష్యంగా ముందుకుసాగటం విడ్డూరంగా ఉందని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం గజ్వేల్‌లో జగదేవ్‌పూర్ మండలం నిర్మల్‌నగర్ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు ప్రతాప్‌రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... సీఎం రేవంత్‌రెడ్డి కుట్రలో భాగంగానే మాజీ మంత్రి హరీశ్‌రావుపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారన్నారు. ప్రజా సమస్యలపై గొంతెత్తాల్సిన కవిత తన వ్యక్తిగత ఎజెండాతో బీఆర్‌ఎస్‌పై విమర్శలు సంధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తన మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరనే విషయాన్ని కవిత తెలుసుకోవాలని హితవు పలికారు. సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు విరాసత్‌అలీ, గంగిశెట్టి రవీందర్, జకీయొద్దీన్, ఉపేందర్‌రెడ్డి, కామల్ల భూమయ్య, హైదర్‌పటేల్ తదితరులు పాల్గొన్నారు.
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు 51% ఫిట్‌మెంట్ ప్రకటించి వెంటనే పీఆర్‌సీని అమలు చేయాలని తెలంగాణ ప్రోగ్రెస్సివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు చిట్యాల విజేందర్‌రెడ్డి అధ్యక్షతన ఇందిరానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించిన సిద్దిపేట జిల్లా జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పీఆర్‌సీ వేసి మూడేళ్లు గడుస్తున్నప్పటికీ నివేదికను తెప్పించుకుని ఫిట్‌మెంట్ ప్రకటించకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 2008 కాంట్రాక్టు ఉపాధ్యాయులకు 12 నెలల వేతనాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఖాళీగా ఉన్న మండల విద్యాధికారుల, డిప్యూటీ డీఈవో పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. అనంతరం జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. సమావేశంలో సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు గాడిపల్లి తిరుపతిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దామెర రాజయ్య వివిధ మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.


