జాతీయస్థాయిలో సత్తా చాటాలి | - | Sakshi
Sakshi News home page

జాతీయస్థాయిలో సత్తా చాటాలి

Nov 16 2026 8:41 AM | Updated on Nov 16 2026 8:41 AM

ఎంపీ రఘునందన్‌ రావు

హత్నూర(సంగారెడ్డి): ఆత్మస్థైర్యంతో క్రీడల్లో పాల్గొని జాతీయస్థాయిలో సత్తా చాటాలని ఎంపీ రఘునందన్‌రావు, ఎమ్మెల్యే సునీతారెడ్డి క్రీడాకారులకు సూచించారు. మండలంలోని దౌల్తాబాద్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మూడు రోజుల పాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి 70వ స్కూల్‌ గేమ్‌ ఫెడరేషన్‌ బాల బాలికల వాలీబాల్‌ పోటీలు ఆదివారం ముగిశాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వారు హాజరై మాట్లాడారు. విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించేందుకు క్రీడాకారులు ముందుకు రావాలన్నారు. ఎంతో మంది గ్రామస్థాయి నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయి విజయాలు సాధించిన వారు ఉన్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఒలంపిక్స్‌ క్రీడలు కూడా మనదేశంలోనే త్వరలోనే పెట్టనున్నారని చెప్పారు. వాటిలో పాల్గొనేందుకు ఇప్పటి నుంచే క్రీడాకారులు సన్నద్ధం కావాలన్నారు. అనంతరం విజయం సాధించిన క్రీడాకారులకు కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డితో కలిసి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎంఈఓ వెంకట్‌ నర్సింహాగౌడ్‌, హెచ్‌ఎం కందప్ప, మాజీ ఎంపీపీ నర్సింలు, సర్పంచ్‌ సంగీత, ఉప సర్పంచ్‌ శేఖర్‌గౌడ్‌, పీడీ, పీటీలు, స్కూల్‌ గేమ్‌ ఫెడరేషన్‌ ఆయా జిల్లాల కార్యదర్శులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement