పాపన్నపేట(మెదక్): ప్రభుత్వ బడుల్లో బాల్యం నుంచే విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, సేవాభావం, క్రమశిక్షణ పెంపొందించే లక్ష్యంతో విద్యాశాఖ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్లను ప్రారంభించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. జిల్లాలో మొత్తం సుమారు 120 పాఠశాలలు ఎంపికయ్యాయి. మొదటి విడతలో 35 పాఠశాలల టీచర్లకు సోమవారం నుంచి హవేళిఘణాపూర్ మహాత్మ జ్యోతిబా పూలే పాఠశాలలో వారం రోజులు పాటు ప్రాథమిక శిక్షణ ఇవ్వనున్నారు. ఎంపికై న ప్రతి పాఠశాల నుంచి ఒక మహిళ, ఒక పురుష టీచర్ శిక్షణకు హాజరు కావాల్సి ఉంటుంది.
పీఎంశ్రీ నుంచి నిధులు
విద్యార్థి సర్వతో ముఖాభివృద్ధే లక్ష్యంగా బాలురకు స్కౌట్స్.. బాలికలకు గైడ్స్ శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం సమగ్ర శిక్ష, పీఎంశ్రీ విభాగాల నుంచి నిధులు విడుదలయ్యాయి. మొదట ఎంపిౖకై న టీచర్లకు శిక్షణ ఇచ్చిన తర్వాత, బడిలో ఆసక్తి గల విద్యార్థులను గుర్తించి యూనిట్‌లో చేర్చుకుంటారు. వీరికి ఉచిత యూనిపాం, షూ ఇవ్వడానికి సైజులు గుర్తించాల్సిందిగా డీఈఓలకు ఆదేశాలు వచ్చాయి. ఇప్పటికే కొన్ని పాఠశాలల్లో ఎన్‌సీసీ యూనిట్లు ఉండగా, ఇప్పుడు దశల వారీగా అన్ని పాఠశాలల్లో బీఎస్‌జీలు ప్రారంభించాలని నిర్ణయించారు. హైస్కూల్‌లోని ఒక్కో స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్‌లో 11 నుంచి 17 ఏళ్ల వయసు గల 32 మంది విద్యార్థులను చేర్చుకుంటారు. ఇందులో 16 బాలికలు, 16 మంది బాలురు ఉంటారు. ఇక ప్రాథమిక పాఠశాలల్లో 11 ఏళ్ల లోపు విద్యార్థులకు కబ్స్, బుల్‌బుల్ పేరిట యూనిట్‌లు ఏర్పాటు చేస్తారు. ఇందులో 12 మంది బాలికలు, 12 మంది బాలురు మొత్తం 24 మంది విద్యార్థులను చేర్చుకుంటారు. ఇందుకోసం బీఎస్‌జీ కొత్త వెబ్‌సైట్‌ను గత నెలలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా చేతుల మీదుగా ప్రారంభించారు.
ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో యూనిట్‌లు
తొలి విడతలో 35 పాఠశాలల్లో..
నేటి నుంచి హవేళిఘణాపూర్‌లో శిక్షణ


