ఏడాదిలో ఆరుగురు మృత్యువాత | - | Sakshi
Sakshi News home page

ఏడాదిలో ఆరుగురు మృత్యువాత

Sep 24 2026 7:52 AM | Updated on Sep 24 2026 7:52 AM

రామాయంపేట మండలం కోమటిపల్లి, నార్సింగి మండలం వల్లూరు జంక్షన్ల వద్ద తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటుండటంతో ఏడాది కాలంలో కనీసం ఆరుగురు మృతి చెందారు. రామాయంపేటకు సంబంధించి మోడల్‌ స్కూలు, కస్తూర్బా పాఠశాలలు కోమటిపల్లి జంక్షన్‌ సమీపంలో ఉండటంతో ప్రతి రోజూ కనీసం మూడు వందల మంది విద్యార్థులు ప్రమాదకర పరిస్థితుల్లో స్కూళ్లకు వెళ్తున్నారు. ఇక్కడ ప్రమాదం జరిగే ఆస్కారం ఉండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కోమటిపల్లి, వల్లూరు వద్ద ఆర్‌ఓబీలు మంజూరు చేయించాలని ఈ ప్రాంత ప్రజల విజ్ఞప్తి మేరకు మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు సర్వీస్‌ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు. ప్రస్తుతం వల్లూరువద్ద సర్వీస్‌ రోడ్డు నిర్మాణం పనులు కొనసాగుతుండగా...కోమటిపల్లి జంక్షన్‌ వద్ద వారం క్రితమే పనులు ప్రారంభమయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement