ఎస్పీకి జన్మదిన శుభాకాంక్షలు | - | Sakshi
Sakshi News home page

ఎస్పీకి జన్మదిన శుభాకాంక్షలు

Sep 24 2026 7:52 AM | Updated on Sep 24 2026 7:52 AM

26 నుంచి ‘ప్రజా కళాజాతర’

మెదక్‌జోన్‌: జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు జన్మదిన వేడుకలను ఎస్పీ కార్యాలయంలో బుధవా రం అధికారులు, సిబ్బంది ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అధికారులు, సిబ్బంది సమక్షంలో ఎస్పీ కేక్‌ కట్‌ చేసి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం పోలీసు అధికారులు ఎస్పీకి శుభాకాంక్షలు చెబుతూ తెలియజేస్తూ ఆయన ఆయురారో గ్యాలు, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

పర్యాటక దినోత్సవానికి ఏర్పాట్లు: అదనపు కలెక్టర్‌

మెదక్‌ కలెక్టరేట్‌: జిల్లాలో ఈనెల 27న నిర్వహించే పర్యాటక దినోత్సవానికి పర్యాటక ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని అదనపు కలెక్టర్‌ నగేశ్‌ సంబంధిత అధికారులకు సూచించారు. అదనపు కలెక్టర్‌ తన ఛాంబర్‌లో పర్యాటక దినోత్సవ ఏర్పాట్లపై బుధవారం ఆయా శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...జిల్లాలోని చారిత్రక, ఆధ్యాత్మిక, ప్రకృతి పర్యాటక ప్రాంతాలను పరిశుభ్రంగా, పచ్చదనంతో, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. మెదక్‌ జిల్లాకు గొప్ప చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, ప్రకృతి సంపద ఉందని తెలిపారు. జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు వస్తుంటారని పేర్కొన్నారు. జిల్లాలోని మెదక్‌ ఖిల్లా, చర్చి, ఏడుపాయల వనదుర్గాభవాని ఆలయం, పోచారం వన్యప్రాణి అభయారణ్యం, నర్సాపూర్‌ అర్బన్‌ ఫారెస్ట్‌, చారిత్రక కోటలు, చెరువులు, జలపాతాలు, దేవాలయాలు తదితర పర్యాటక ప్రదేశాల్లో ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. సమావేశంలో డీపీఆర్‌ఓ రామచంద్రరాజు, మున్సిపల్‌ కమిషనర్‌ నవీన్‌, ఈడీయం సందీప్‌, మహేందర్‌, ఆర్‌ ఐ లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

పీఎం ఆవాస్‌ యోజన ఇళ్లకే ఇందిరమ్మ పేరు

బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్‌

మెదక్‌జోన్‌: పీఎం ఆవాస్‌ యోజన పథకం కింద పేదప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లుగా పేరు మార్చిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్‌ పేర్కొన్నారు. బీజేపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...కేంద్ర ప్రభుత్వ పథకాలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం పేర్లు మార్చి వారి ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. అందులోభాగంగానే పీఎం ఆవాస్‌ యోజనకింద కేంద్రం నిధులిస్తే పేరు మార్చి వారి కార్యకర్తలకే ఇళ్లు ఇస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటివరకు పీఎం ఆవాస్‌ యోజన పథకం కింద 2 లక్షల ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. అంతకుముందు సేవా సంకల్ప్‌ అభియాన్‌లో భాగంగా 25 ఏళ్ల మోదీ పాలన గురించి పుస్తకాన్ని విడుదల చేశారు. కార్యక్రమంలో నేతలు ఈర్ల రంజిత్‌రెడ్డి, నాగరాజు, నల్లాల విజయ్‌ తదితరులు ఉన్నారు.

గజ్వేల్‌: అరుణోదయ విమలక్క 50ఏళ్ల పాటల ప్రస్థానాన్ని పురస్కరించుకొని ఈనెల 26నుంచి 28వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న ‘ప్రజా కళా జాతర’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఉపాధ్యాయ, ప్రజా సంఘాల నాయకులు రాంచంద్రం, సత్యనారాయణ, రాజులు,ఏ. మల్లికార్జున్‌, కృష్ణ, సత్తయ్య, ఎల్లయ్య, చిన్ని క్రిష్ణ, నర్సింహ కోరారు. బుధవారం గజ్వేల్‌లో ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 52ఏళ్ల అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యలో విమలక్క ప్రస్థానం గొప్పదని గుర్తు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించనున్న ‘ప్రజాకళా జాతర’లో ఈనెల 26నుంచి 28వరకు 50పాటలు, 50 ప్రదర్శనలు ఉంటాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement