ఈకేవైసీ చేస్తేనే గ్యాస్‌ సబ్సిడీ | - | Sakshi
Sakshi News home page

ఈకేవైసీ చేస్తేనే గ్యాస్‌ సబ్సిడీ

Sep 24 2026 7:52 AM | Updated on Sep 24 2026 7:52 AM

● తుది గడువు ఈ నెలాఖరు ● అక్టోబర్‌ నుంచి కఠినంగా అమలు

● తుది గడువు ఈ నెలాఖరు ● అక్టోబర్‌ నుంచి కఠినంగా అమలు

మెదక్‌ కలెక్టరేట్‌: ఎల్‌పీజీ గ్యాస్‌ వినియోగదారులు ఈ నెలాఖరులోగా ఈకేవైసీ చేసుకోకపోతే వచ్చేనెల నుంచి సబ్సిడీ నిలిచిపోనుంది. ఇప్పటికే గత మూడు నెలలుగా అవకాశం ఇచ్చినప్పటికీ కొంతమంది లబ్ధిదారులు నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అక్టోబర్‌ నుంచి కఠినంగా ఈకేవైసీ అమలు చేసేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.

అక్రమాలు అరికట్టేందుకు

దేశవ్యాప్తంగా సబ్సీడీ గ్యాస్‌ సిలిండర్లు పక్కదారి పడుతున్నాయని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం అక్రమాలను అరికట్టేందుకు కేంద్రం ఈకేవైసీని అమలు చేయాలని తీర్మానించింది. ఇందులోభాగంగా గత మూడు నెలలుగా లబ్ధిదారులకు సూచనలు చేస్తుండగా, కొంతమంది లబ్ధిదారుల్లో స్పందన కరువైంది. మరోవైపు రాష్ట్రంలో తెల్ల రేషన్‌కార్డు కలిగిన నిరుపేదలకు మహాలక్ష్మి పథకం రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తామని ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించింది. అలాగే కేంద్ర ప్రభుత్వం సైతం ఉజ్వల పథకం కింద గ్యాస్‌ కనెక్షన్‌ పొందిన లబ్ధిదారులకు సబ్సిడీ అందజేస్తుంది. ఇందుకోసం ఆన్‌లైన్‌లో తమ పూర్తి వివరాలు అందజేయాలని కొన్ని నెలలుగా ప్రభుత్వాలు ప్రకటనలు చేస్తూనే ఉన్నాయి. కొంతమంది సరిచేసుకోగా ఇంకా కొంతమంది మిగిలిపోయినట్లు సమాచారం. వారికోసం ఈకేవైసీ చేసుకునేందుకు ఈనెలాఖరు తుది అవకాశం కల్పించారు.

3,84,373 కనెక్షన్లు

జిల్లాలో మొత్తం 3,84,373 గ్యాస్‌ కనెక్షన్లున్నాయి. అందులో 52,047 ఉజ్వల వినియోగదారులు ఉండగా 16 ఏజెన్సీల ద్వారా గ్యాస్‌ సిలిండర్లను లబ్ధిదారులకు సరఫరా చేస్తున్నారు. లబ్ధిదారులంతా ఈ నెలాఖరులోగా ఈకేవైసీ చేసుకోవాలి లేదంటే సబ్సిడీ ఆగిపోనుంది.

ఏజెన్సీలు ప్రోత్సహించాలి

గ్యాస్‌ వినియోగదారులు ఈ కేవైసీ చేసుకునేలా ఏజెన్సీలు ప్రోత్సహించాలి. లబ్ధిదారులకు సమాచారం అందజేసి వెంటనే అప్‌డేట్‌ చేసుకునేలా చర్యలు చేపట్టాలి. వినియోగదారులు ఈకేవైసీ సేవల సహాయం కోసం టోల్‌ఫ్రీ నంబర్‌ 1800 2333 55ను సంప్రదించాలన్నారు.

– నిత్యానంద్‌, జిల్లా సివిల్‌ సప్లయ్‌ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement