మీకు గార్డియన్‌గా ఉంటా | - | Sakshi
Sakshi News home page

మీకు గార్డియన్‌గా ఉంటా

Sep 24 2026 7:52 AM | Updated on Sep 24 2026 7:52 AM

ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తా

హుస్నాబాద్‌: విద్యార్థులకు ఏ సమస్య ఉన్నా చెప్పే హక్కు ఉందని, నేను మీకు గార్డియన్‌గా ఉండి పరిష్కరిస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. బుధవారం హుస్నాబాద్‌ ఇంజనీరింగ్‌ కళాశాలను మంత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్ధులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. బాలుర హాస్టల్‌లో బాత్రూమ్స్‌, బస్సు రవాణా, లైబ్రరీ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హాస్టల్‌లో విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించాలన్నారు. విద్యార్థులతో కలిసి కమిటీ ఏర్పాటు చేసి భోజనం, వసతులపై వారి అభిప్రాయాలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ రకాల పోటీలు, ఇతర సహపాఠ్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. విద్యార్థులు గంజాయి, డ్రగ్స్‌ వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. కళాశాలలో ప్రతిభ కనబరిచే టాపర్లకు ల్యాప్‌టాప్‌లు అందిస్తామన్నారు. క్యాంపస్‌ సెలెక్షన్‌, ప్లేస్‌మెంట్స్‌ తీసుకువచ్చేందుకు చర్యలు చేపడతామన్నారు. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలకు చెందిన రిటైర్డ్‌ ప్రొఫెసర్లతో మోటివేషన్‌ క్లాస్‌లు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో శాతవాహన యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ ఉమేశ్‌ కుమార్‌, రిజిస్ట్రార్‌ సతీష్‌, ప్రిన్సిపాల్‌ తిరుపతి రెడ్డి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కేడం లింగమూర్తి, అధ్యాపకులు ఉన్నారు.

టాపర్లకు ల్యాప్‌టాప్‌లు అందిస్తా

మంత్రి పొన్నం ప్రభాకర్‌

ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులతో ముఖాముఖి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement