న్యూస్‌రీల్
గురువారం శ్రీ 24 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
● నేటి రాత్రి నుంచి ప్రారంభం కానున్న నిమజ్జనోత్సవాలు ● ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న అధికారులు
హవేళిఘణాపూర్(మెదక్): మెదక్ మండల పరిధిలోని కొంటూర్ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లు పూర్తయ్యాయి. మెదక్ పట్టణంలో ఏర్పాటు చేసిన వినాయకులను ఇప్పటికే కొన్ని బుధవారం నిమజ్జనానికి తరలించగా గురువారం రాత్రి నుంచి పెద్ద ఎత్తున కోంటూర్ చెరువుకు తరలివెళ్లనున్నాయి. అందుకవసరమైన క్రేన్లు, ప్రమాదాలు జరుగకుండా గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశారు. కోంటూర్ చెరువు వద్దకు తరలివెళ్లే రోడ్డును చదును చేశారు. మెదక్ రూరల్ సీఐ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.


