ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

Aug 24 2026 7:21 AM | Updated on Aug 24 2026 7:21 AM

రామాయంపేట(మెదక్‌): ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం విషయమై ప్రభుత్వం ఎంతమాత్రం పట్టించుకోవడం లేదని తపస్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చల్లా లక్ష్మణ్‌, అకాడమిక్‌ సెల్‌ రాష్ట్ర కోకన్వీనర్‌ వెంకటస్వామి ఆరోపించారు. ఆదివారం సంఘం కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయా లు సరిగా లేవన్నారు. కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో సైతం ఓపీ సేవలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్‌ ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి, ఓపీఎస్‌ విధానాన్ని అమలు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. సమావేశంలో సంఘం మండల ప్రధాన కార్యదర్శి సిద్దిరాంలు, జిల్లా ఉపాధ్యక్షులు సంతోష్‌కుమార్‌, మన్నె గోపాల్‌, ప్రవీణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement