త్రివర్ణంలో వనదుర్గమ్మ | - | Sakshi
Sakshi News home page

త్రివర్ణంలో వనదుర్గమ్మ

Aug 16 2026 8:26 AM | Updated on Aug 16 2026 8:26 AM

త్రివర్ణంలో వనదుర్గమ్మ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జెండా ఆవిషరించిన ఎమ్మెల్యే రోడ్డు మరమ్మతు పనులు చేపట్టకపోతే ఆందోళనే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కలిసిన బీజేపీ నాయకులు

పాపన్నపేట(మెదక్‌): స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఏడుపాయల వనదుర్గమ్మను మువ్వన్నెల జెండా రంగులపూలతో అలంకరించారు. జాతీయ జెండాను తలపించే రీతిలో ఉన్న దుర్గమ్మ అలంకరణ చూసిన భక్తులు తన్మయత్వం చెందారు. స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో, భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

నర్సాపూర్‌: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే సునీతారెడ్డి శనివారం జాతీయ జెండాను ఆవిష్కరించారు. రెవెన్యూ డివిజన్‌ కార్యాలయం ఎదుట ఆర్‌డీఓ రామకృష్ణ పట్టణంలోని ఆయా కార్యాలయాల ఎదుట అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించారు.

బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి

హవేళిఘణాపూర్‌(మెదక్‌): గతేడాది భారీ వర్షాలతో దెబ్బతిన్న రాజ్‌పేట వెళ్లే రోడ్డు పనులు వెంటనే ప్రారంభించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గుంతలమయంగా మారి ప్రమాదకరంగా ఉన్నా ఇంతవరకు పట్టించుకోకపోవడంతో ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారన్నారు. మండల పరిధిలోని శనివారం రాజ్‌పేట బ్రిడ్జి, గుంతలమయంగా ఉన్న రోడ్డును పరిశీలించారు. అనంతరం పద్మారెడ్డి మాట్లాడుతూ...గతేడాది భారీ వర్షాలు కురవడం వల్ల నియోజకవర్గంలో అనేకచోట్ల రోడ్లు కొట్టుకుపోయి ఇప్పటికీ శాశ్వత మరమ్మతులు చేపట్టకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గతేడాది గడుస్తున్న ఈ పనులు చేపట్టడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, మాజీ జెడ్పీ వైస్‌చైర్మన్‌ లావణ్యరెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకులు శ్రీను, యామిరెడ్డి, సాయాగౌడ్‌, కిషన్‌, బాల్‌రాజ్‌ మండల బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

తూప్రాన్‌: కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డిని శనివారం సిద్దిపేట జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకులు ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలిపారు. ఇటీవల జరిగిన కొమురవెల్లి రైల్వేస్టేషన్‌ ప్రారంభోత్సవ ఏర్పాట్లు అత్యంత సజావుగా, ఘనంగా నిర్వహించారని నాయకులను మంత్రి ప్రత్యేకంగా అభినందించారని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన రైల్వే సౌకర్యాలు కల్పించినందుకు మంత్రిగారికి జిల్లా నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిని కలిసినవారిలో జిల్లా పార్టీ అధ్యక్షుడు బైరి శంకర్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి నత్తి మల్లేశ్‌ ముదిరాజ్‌, విభీషణ్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు వేణుగోపాల్‌, ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శంకర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement