మెదక్‌జోన్: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్ని ప్రభుత్వ కార్యాలయాలతోపాటు వివిధపార్టీల నేతలు వారి, వారి పార్టీల కార్యాలయాలపై జాతీయజెండాను ఆవిష్కరించారు. ఇందులోభాగంగా కోర్టు ప్రాంగణంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ, ఎస్పీ కార్యాలయం ముందు అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్‌సింగ్, కాంగ్రెస్ నేతలు రాందాస్ చౌరస్థాలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఎమ్మెల్యే రోహిత్‌రావు ఆవిష్కరించారు. బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు.


